ఈ వయసులో ఇంత సాహసం అవసరమా తమన్నా.. ఏమైనా అవుతే ఎలా అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి శ్రీ సినిమా ద్వారా అడుగుపెట్టిన మిల్క్ బ్యూటీ తమన్నా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా తర్వాత తర్వాత నటించిన హ్యాపీ చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నారు.

 Video Tamannaah Bhatia Gives Glimpse Of Her Intense Workout As She Flaunts Her T-TeluguStop.com

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా.కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ దశాబ్దకాలం పూర్తయినప్పటికీ నేటి హీరోయిన్లకు పోటీగా ఈమె సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

ఇక కరోనా కారణం వల్ల లాక్ డౌన్ సమయంలో కాస్త బొద్దుగా మారిన తమన్నాను చూసిన నెటిజన్లు చాలా బొద్దుగా ఉందని చెప్పడంతో ఈమె తన శరీర బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే జిమ్ములో ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తూ శరీర బరువును తగ్గించుకోవడం కోసం చెమట చిందిస్తుంది.తాజాగా ఈమె జిమ్ లో చేస్తున్నటువంటి కసరత్తులకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈమె చేస్తున్న వ్యాయామాలు చూసి ఈ వయసులో అంత కఠినమైన వ్యాయామాలు అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఏదో తమాషాగా అంటే ఇంత కఠినంగా కష్ట పడాలా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి తమన్నా షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇకపోతే తమన్నా సినిమా విషయానికి వస్తే తాజాగా ఈమె నితిన్ సరసన నటించిన మాస్ట్రో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ మంచి పేరు సంపాదించుకుంది.అదేవిధంగా గోపీచంద్ సరసన సిటీ మార్ చిత్రంలో నటించి ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

ఇకపోతే ఈమె నటించిన ఎఫ్ 3 త్వరలోనే విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube