వీడియో: బస్సుకు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యార్థులు.. ఆపి మరీ చివాట్లు పెట్టిన మహిళ..

ఇండియాలో లోకల్, ఆర్డినరీ బస్సుల్లో చాలామంది జనం కిక్కిరిసి మరీ ఎక్కుతుంటారు.ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవారు, స్కూల్, కాలేజీలకు పోయేవారు, పనులకు చేరుకునేవారు అందరూ కూడా బస్సుల మీద ఆధారపడతారు.

 Video Students Hanging Dangerously From The Bus The Woman Stopped And Got Angry-TeluguStop.com

సమయానికి ఎవరి పనికి వారు వెళ్లక పోతే చివాట్లు తింటారు.అందుకే పొద్దున్నే ఏ బస్సు ముందు వస్తే దాన్నే ఎక్కేస్తుంటారు.

ఒక్కోసారి బస్సు డోర్లకు వేలాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తుంటారు.ఏ కొంచెం తేడా వచ్చినా బస్ పైనుంచి కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది.

అయినా కూడా ఎవరూ ప్రమాదాలను లెక్క చేయరు.

తమిళనాడులో( Tamil Nadu ) కూడా ఇటీవల ఒక బస్సులో విపరీతంగా జనాలు ఎక్కేసి వెళ్తున్నారు.ఆ సమయంలో విద్యార్థులు బస్ డోర్‌కు వేలాడుతూ కనిపించారు.అయితే బస్ అలా వెళుతూ ఉండగా ఒక మహిళ వీరిని చూసింది.

అంతే ఆమె వెంటనే బస్సు ముందుకు వచ్చి ఆపింది.విద్యార్థులను చిన్నగా చేతితో కొడుతూ.“ఏరా ఇలా ప్రయాణిస్తున్నారు.ఏదైనా ప్రమాదం జరిగితే ఏంట్రా?” అంటూ వారిని బాగా తిట్టింది.విద్యార్థి బస్సు దిగడానికి మారం చేస్తుంటే రెండు తగిలించింది.సొంత తల్లి లాగా ఆమె వారి పట్ల కేర్ చూపించడం చూసి చాలామంది ఫిదా అయిపోయారు.బస్సు డ్రైవర్( Bus driver ) కూడా ఆమెకు హెల్ప్ చేశారు.”ఎవరో కూడా తెలియదు.అయినా వారి శ్రేయస్సు గురించి ఈ మహిళ పట్టించుకుంది.ఈ దృశ్యం చూస్తుంటే చాలా ఆనందమేస్తోంది” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు.నిజమైన హీరో అంటే ఈమెనే అని ఇంకొకరు ఆమెను ప్రశంసించారు.ఆమె పక్కా టీచర్ అయ్యుంటుందని ఒకరు చమత్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube