వీడియో: రివర్స్‌లో బైక్ నడిపిన యువకుడు... గొయ్యిలో ఎలా పడ్డాడో చూస్తే షాకే..!

రోడ్డు ప్రమాదాల వీడియోలు ఇంటర్నెట్‌లో తరచుగా వేల సంఖ్యలో అప్‌లోడ్ అవుతుంటాయి.ఇలాంటి యాక్సిడెంట్ వీడియోలను చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది.

 Video Shocking To See How A Young Man Who Rode A Bike In Reverse Fell Into A Pit , Bike , Young Man ,reverse Driving ,viral Latest, News Viral, Social Media, Video Virall-TeluguStop.com

కొన్ని వీడియోలు చూస్తే షాక్ అవ్వక తప్పదు.ఎందుకంటే ఆ వీడియోలలోని వ్యక్తులు ఎవరూ ఊహించని రీతిలో ప్రమాదానికి గురవుతారు.

అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 Video Shocking To See How A Young Man Who Rode A Bike In Reverse Fell Into A Pit , Bike , Young Man ,reverse Driving ,viral Latest, News Viral, Social Media, Video Virall -వీడియో: రివర్స్‌లో బైక్ నడిపిన యువకుడు#8230; గొయ్యిలో ఎలా పడ్డాడో చూస్తే షాకే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

@వై మెన్ లివ్ లెస్ అని పిలిచే ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో… హెల్మెట్, బైకింగ్ గేర్‌ ధరించిన ఒక బైకర్‌ను మీరు చూడవచ్చు.

అతడు తన బైక్‌ను రివర్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు.అయితే అతని బైక్ వెనుక ఉన్న రోడ్డుపై లోతైన గుంత స్పష్టంగా కనిపిస్తోంది కానీ అతడు దానిని గమనించలేదు.

అలానే తన బైక్‌ని వెనక్కి నెట్టుకుంటూ వెళ్లాడు.హైవేకి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దుకాణం ఉండగా దాని పక్కనే గొయ్యి ఉంది.ఈ విషయాన్ని గుర్తించని ఆ బైకర్ వెనక్కి వెళ్తూ వెళ్తూ చివరికి తన బైక్‌తో పాటు గొయ్యిలో పడిపోయాడు.ఆ తర్వాత కెమెరా కంటికి కనిపించకుండా పూర్తిగా అదృశ్యమవుతాడు.

అంటే ఆ గొయ్యి ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆ వ్యక్తిని తర్వాత ఎలా లాగారు లేదా ఎవరైనా రక్షించారా అనేది వీడియోలో చూపించలేదు.

ఇప్పటికే ఈ వీడియోకి 13 లక్షల వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు అయ్యోపాపం అని అంటున్నారు.

మరికొందరు మాత్రం బండిపై ఉన్నప్పుడు వెనుక, ముందు చూసుకుని వెళ్ళాలి అని సలహా ఇస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube