వైరల్ వీడియో : చదువుకోమని చెబితే నిద్రపోతున్న బాతు పిల్ల!

సాధారణంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మధ్యాహ్న భోజనం తరువాత క్లాసుకు వెళితే నిద్రపోతూ ఉంటారు.కడుపు నిండా ఆహరం తినడం వల్ల నిద్రపోతారో లేక పాఠాలు నచ్చక నిద్రపోతారో కానీ నిద్రపోయి టీచర్లతో తిట్లు తినే పిల్లలు చాలామందే ఉంటారు.

 Video Of Sleepy Duck Leaves People On The Internet, Animals, Duck, Netizens, Tea-TeluguStop.com

కొన్ని సందర్భాల్లో టీచర్లు నిద్రపోయే విద్యార్థులను క్లాసులో నిలబెట్టడమో లేక మరో పనిష్మెంట్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు.

మనుషులు అయితే చదువుతారు కాబట్టి నిద్రపోతారు కానీ జంతువులకు మాత్రం ఇలాంటి కష్టాలేమీ ఉండవు.

అయితే ఒక బాతు మాత్రం ఎవరైనా చదువుకోమని చెప్పారో లేక తనంతట తానే చదువుకోవాలని నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ పుస్తకం ముందు పెట్టుకొని బాతు తూగుతూనే ఉంది.సోషల్ మీడియాలో బాతు తూగుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.

తూగుతున్న బాతు మధ్యలో లేచి పుస్తకాల వంక చూస్తుండటం గమనార్హం.

అచ్చం మనుషులు ఏ విధంగా చేస్తారో బాతు కూడా అదే విధంగా ప్రవర్తించింది.

కొందరు నెటిజన్లు ఈ వీడియోను చూసి ” పుస్తకాలను చూస్తే మనుషులకే నిద్ర వస్తుందని అనుకున్నామని కానీ బాతులకు కూడా నిద్ర వస్తోంది” అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు “బాతు పుస్తకాలతో కుస్తీ పట్టడం ఎందుకు.

సంతోషంగా నిద్రపోవచ్చు కదా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు ఈ వీడియోను 21 వేల మంది వీక్షించగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

యూట్యూబ్ ఇండియా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది.మొత్తానికి బాతు మాత్రం పుస్తకాలను ముందు పెడితే మనుషులకు బాతులకు తేడా ఉండదని ప్రూవ్ చేసింది.

అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో ఘటన ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube