వైరల్ వీడియో.. ఇదేం విడ్డూరం.. మేకను పెళ్లి చేసుకున్న యువకుడు..!

పెళ్లి అనేది జీవితంలో వచ్చే ఎంతో మధురమైన ఘట్టం.అలాంటి పెళ్లి జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం.

 Video Of Man Gets Marriage With Goat Goes Viral-TeluguStop.com

అంతేకాదు పెళ్లి ఇద్దరి మనుషులను మాత్రమే కాదు.రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది.

అందుకే పెళ్లిని ఎంతో ఖర్చు పెట్టి మరీ అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు మన పెద్దలు.జీవితంలో ఒకేసారి వచ్చే ఆ అద్భుతమైన పెళ్లిని ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తుంటారు.

 Video Of Man Gets Marriage With Goat Goes Viral-వైరల్ వీడియో.. ఇదేం విడ్డూరం.. మేకను పెళ్లి చేసుకున్న యువకుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవరి ఆర్ధిక పరంగా వారు ఉన్నంతలో బాగా జరిపించాలని అందరిని పిలిచి విందు భోజనాలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలని ఆకాంక్షిస్తుంటారు.అలానే ఒక వ్యక్తి తన పెళ్లిని కూడా అంగరంగ వైభవముగా బంధువులను, స్నేహితులను పిలిచి భోజనాలు పెట్టి మరి చేసుకున్నాడు.

అందరు పెళ్ళిలో పాల్గొని సందడి చేసారు.కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

ఏంటంటే.అతడు పెళ్లి చేసుకుంది అందమైన అమ్మాయిని కాదు.ఒక మేకను పెళ్లి చేసుకున్నాడు.ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీనిని చూసి ముందుగా ఆశ్చర్య పోయినా ఆ తర్వాత పగలబడి నవ్వడం ఖాయం.ఈ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది.

అక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం మేకను అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఆ యువకుడు ఇలా మేకను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

అన్ని సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లిని జరిపించారు.మేకతో పాటు ఏడూ అడుగులు కూడా వేసాడు.

అప్పుడు బంధువులంతా నవ్వుతు ఈ పెళ్లిని వీక్షించారు.వివాహ సమయంలో కొన్ని దోషాలు ఉన్న కారణంగా ఇలా చేసుకున్నాడో లేక ఫేమస్ అవ్వడం కోసం ఇలా చేసుకున్నాడో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం నెటిజెన్స్ ను బాగా నవ్విస్తుంది.

మీరు కూడా ఒక లుక్కేయండి.

#Goat #Goat #Pakistan Goat #Young Goat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు