పిల్లులు ( Cats ) చాలా స్వతంత్రంగా ఉంటాయి.ఒకరిపై అవి ఎప్పుడూ ఆధారపడవు.
ఎలాంటి సిచువేషన్‌లోనైనా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాయి.అంతేకాదు ఇవి క్యూరియస్ యానిమల్స్.
ఇవి ప్లే ఫుల్ యానిమల్స్ కూడా.యజమానులతో గంటల తరబడి ఆడుకుంటూ ఎంటర్‌టైన్‌మెంట్ పంచగలవు.
అయితే తాజాగా వార్ జోన్‌లో( War Zone ) ఓ పిల్లి చిలిపిగా బిహేవ్ చేసింది.దాని ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సైనికుల దినచర్యలో ఈ పిల్లి ఎలా భాగమవుతుందో, వారి పనులు, వార్ యాక్టివిటీస్ వారితో ఇది ఎలా కలిసిపోతుందో వీడియోలో కనిపించింది.
వీడియోలో పిల్లి తన ఉల్లాసభరితమైన, ఆసక్తికరమైన కోణాన్ని చూపించడం మనం చూడవచ్చు, అంతేకాదు, పెద్ద గన్స్ పట్టుకొని యుద్ధం( War ) చేస్తున్న సైనికులతో ( Soldiers ) అది కమ్యూనికేట్ అవుతోంది.వారి లవ్, కేర్‌ను కోరుకుంటుంది.కొన్నిసార్లు, పిల్లి కూడా సైలెంట్ అబ్సర్వర్‌గా పనిచేస్తుంది, ప్రశాంతమైన ప్రవర్తనతో పరిసరాలను చూస్తుంది.
ఈ వీడియో బాధించే యుద్ధ సన్నివేశాలతో పాటు, పిల్లి అమాయక ప్రవర్తనను మనకు చూపిస్తుంది.ఈ వైరుధ్యం, పిల్లి, సైనికుల మధ్య ఉన్న బంధం నెటిజన్ల హృదయాలను తాకింది.
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై చాలామంది కామెంట్లు చేస్తున్నారు.యుద్ధం ఎన్నో బాధలను మిగుల్చుతుంది.అలాంటి సమయంలో కలిగే బాధ వర్ణనాతీతం.ఆ బాధాకరమైన సమయంలో ఈ పిల్లి సైనికులతో హ్యాపీ గా ఆడుకుంటూ వారిని ఖుషి చేస్తోంది.