వైరల్: బైక్ తో రోడ్డుమీద గింగిరాలు కొట్టిన యువతి... నెటిజన్ల డిమాండ్ ఇదే!

Video Of Female Biker Stunting On Marine Drive In Patna Goes Viral Details, Bike Stuns, Viral Latest, News Viral, Social Media, Viral Video, Bihar, Patna, Marine Drive Stunt, Female Biker, Female Biker Stunts, Hunter Queen

ఈ మధ్య ఆడవాళ్లు ఈ విషయంలో తగ్గట్లేదు.జనరేషన్ అలాంటిది మరి.

 Video Of Female Biker Stunting On Marine Drive In Patna Goes Viral Details, Bike-TeluguStop.com

నిన్న మొన్నటి జెనరేషన్ ఆడవాళ్లు కనీసం స్కూటీ తీయమన్న తీయలేని పరిస్థితి.ఎందుకంటే, వారికి డ్రైవింగ్ అనగానే చాలా భయం వచ్చేస్తుంది.

కానీ నేటి జనేరేషన్ అలా కాదు… స్కూటీ ఏం ఖర్మ, మేము అబ్బాయిలకు ధీటుగా బైక్స్ కూడా డ్రైవ్ చేయగలుగుతాం అంటున్నారు.అంతేకాదు, కొందరి కుర్రాళ్ళగా బైక్ స్టెంట్స్( Bike Stunts ) కూడా చేయగలం అని అంటున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూస్తే మీరు నిజమే అంటారు.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి దృశ్యాలు మనకు తారసపడుతున్నాయి.

ఇపుడు చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి బైక్స్ తో రోడ్లమీద రకరకాల విన్యాసాలను చేస్తూ జనాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి.కొన్ని సార్లు వీరు చేసే విన్యాసాలు ప్రాణాలకు ప్రమాదకరం అని తెలిసినా ఎక్కడా తగ్గడం లేదు.తాజాగా ఓ యువతి( Women Biker ) బైక్ మీద చేసిన స్టంట్ వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.దాంతో కొంతమంది ఇలాంటి విన్యాసాలు ఆ యువతికి మాత్రమే కాదు.ఇతరులకు కూడా ప్రమాదం కనుక తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు శాఖవారిని డిమాండ్ చేస్తున్నారు.

బీహార్ రాజధాని పాట్నాకి చెందిన హంటర్ క్వీన్( Hunter Queen ) అనే యువతి వీడియో వైరల్ అవుతోంది.ఇందులో మహిళా బైకర్ మెరైన్ డ్రైవ్ స్టంట్ చేస్తూ కనిపించింది.దీనికోసం ఆమె ఏకంగా హైవేపై అత్యంత వేగంతో, ప్రమాదకరమైన రీతిలో బైక్ నడుపుతోంది.ఈ సమయంలో ఆమె బైక్ హ్యాండిల్ నుండి రెండు చేతులను తీసివేయడం మనం గమనించవచ్చు.

అదే వేగంగా నడుపుతున్న బైక్‌పై నిలబడి స్టైల్ కొట్టడం కూడా కనిపిస్తుంది.ఈ సమయంలో ఆమె చేతిలో పిస్టల్ ఉండడం మనం గమనించవచ్చు.ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.అయితే కొందరు ఆ యువతిపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

మరికొంతమంది ఆమెకి వీడియో తీసినవారిపైన కూడా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube