వైరల్: నెటిజన్లను కంటతడి పెట్టించిన వీడియో

సాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు ఎందుకు అవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.కానీ కొన్ని వీడియోలు మాత్రం ఖచ్చితంగా వైరల్ అవ్వాల్సిన అవసరం ఉంటుందని వాటిని చూడగానే మనం చెప్పగలం.

 Video Of Daughter Kissed Father Statue In Chattisgarh Goes Viral-TeluguStop.com

మరికొన్ని వీడియోలను చూడగానే మనం కూడా వాటిని వైరల్ చేస్తుంటాం.తాజాగా ఇలాంటిదో ఒక వీడియో వైరల్ అవుతూ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఎస్సైగా పని చేసిన మూలచందర్ కాన్వార్ సింగ్ గతేడాది నక్సల్స్ దాడిలో మృతిచెందాడు.ఆ సమయంలో ఆయన భార్య గర్భవతి.

ఆయన మృతి చెందిన కొద్దిరోజులకే ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.కాగా ఇటీవల మూలచందర్ జయంతి సందర్భంగా పాపను ఆయన విగ్రహం వద్దకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.

ఆయన తన తండ్రి అని చెప్పడంతో, ఆ పాప చాలా ప్రేమగా ‘నాన్నా’ అంటూ పిలిచి, విగ్రహానికి ముద్దులు పెడుతూ ఆప్యాయంగా పలకరించింది.

ఇది చూసిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

పాప ప్రేమకు వారి రోదనలు మిన్నంటాయి.కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి కంటతడి పెడుతున్నారు.చనిపోయిన తండ్రి కోసం ఆ పాప చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube