వీడియో : ఈ జవాన్‌కు సెల్యూట్‌... ఈయన చేసిన పనికి అధికారులు సైతం ఫిదా అయ్యారు  

Video Of Crpf Jawan Feeding Kashmiri Boy Goes Viral-iqbal Singh,kashmiri Boy,twitter,జవాన్‌,పుల్వామ,సోషల్‌ మీడియా

జవాన్‌లు మన దేశంను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక్క నిమిషం జవాన్‌లు కన్ను రెప్ప మూస్తే శ్రతుదేశం వారు ఎప్పుడెప్పుడు ఇండియా మీద పడుదామా అంటూ ఎదురు చూస్తున్నారు. అందుకే కంటి రెప్ప కూడా మూయకుండా బౌర్డర్‌లో జవాన్‌లు పహారా కాస్తున్నారు..

వీడియో : ఈ జవాన్‌కు సెల్యూట్‌... ఈయన చేసిన పనికి అధికారులు సైతం ఫిదా అయ్యారు-Video Of CRPF Jawan Feeding Kashmiri Boy Goes Viral

అలాంటి వారికి ఎంతగా వందనం చేసినా కూడా తక్కువ. అలాంటి దేశ సేవ చేస్తున్న జవాన్‌లలో మానవత్వం చాలా ఎక్కువగా ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది. తాజాగా కశ్మీర్‌లో జవాన్‌ ఇక్బాల్‌ సింగ్‌ చిన్న పిల్లాడికి ఆహారం తినిపిస్తూ సోషల్‌ మీడియాలో కనిపించాడు.

అతడు చేసిన పనికి దేశం కూడా సెల్యూట్‌ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఫిబ్రవరి 14వ తారీకున జరిగిన పుల్వామ ఉగ్ర దాడిలో ప్రాణాలతో బయట పడ్డ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ఇక్బాల్‌ సింగ్‌ తాజాగా కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో ఉన్న వారికి ఆర్మీ వాహనం బోజనం డబ్బాలు తీసుకు వచ్చింది. ఎవరి డబ్బాలు వారు తీసుకుని తింటున్న సమయంలో ఇక్బాల్‌ ను చూసిన ఒక చిన్న పిల్లాడు ఆకలిగా ఉందని సైగ చేశాడట.

దాంతో ఇక్బాల్‌ ఆ పిల్లాడికి తన డబ్బా ఇచ్చాడు. అయితే ఆ పిల్లాడు అంగవైకల్యం ఉన్న పిల్లాడు కావడంతో స్వయంగా జవాన్‌ ఆ పిల్లాడికి భోజనం తినిపించాడు.

పిల్లాడికి జవాన్‌ బోజనం తినిపిస్తున్న సన్నివేశంను తోటి జవాన్‌లు వీడియో తీశారు. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఆర్మీ ఉన్నతాధికారులు ఇక్బాల్‌ సింగ్‌ను ప్రశంసిస్తూ ప్రశంస పత్రం మరియు బహుమానంను పంపించడం జరిగింది. నీలాంటి జవాన్‌లు ఆర్మీలో ఉండటం గర్వంగా ఉందంటూ తోటి ఆర్మీ జవాన్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్‌లో రోజుల తరబడి కుటుంబంకు దూరంగా ఉండటం వల్ల వారు కఠినంగా తయారు అవుతారని అంతా భావిస్తారు..

కాని అది నిజం కాదని ఇక్బాల్‌ సింగ్‌ ను చూస్తే అనిపిస్తుంది. అందుకే ఇక్బాల్‌ సింగ్‌ కు సెల్యూట్‌ చేయాల్సిందే.

ఇక్బాల్‌ సింగ్‌ పిల్లాడికి తినిపించే వీడియోను కింద చూడవచ్చు.


Click Here to Watch Video