కన్న తల్లిపై చేయి చేసుకున్న కొడుకు.. ఆ తల్లి పోలీసులతో ఏం చెప్పిందో తెలిస్తే గుండె తరుక్కు పోవడం ఖాయం  

Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action-

ఒకప్పుడు కన్న తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉండేది.తల్లితండ్రులకు పిల్లలు భయపడటంతో పాటు, తల్లిదండ్రులు ఏం చెబితే అదే వేద వాక్కు అన్నట్లుగా ఉండే వారు.

Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action- Telugu Viral News Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action--Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action-

కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది.అందరు పిల్లలు ఒకేలా ఉంటారని చెప్పడం లేదు, కాని ఎక్కువ శాతం మంది పిల్లలు ముఖ్యంగా టీనేజర్స్‌ మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action- Telugu Viral News Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action--Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action-

తల్లిదండ్రుల మాట వినకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తే తిరిగి తల్లిదండ్రులపై దాడి చేసే పిల్లలు తయారు అవుతున్నారు.

కర్ణాటక కృష్ణరాజపురంకు చెందిన జీవన్‌ అనే 17 ఏళ్ల కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు.కాలేజ్‌కు పోకుండా స్నేహితులు, పార్టీలు అంటూ తాగుడుకు బానిస అయ్యాడు.ఇంట్లో బలవంతంగా డబ్బులు తీసుకు వెళ్లడం, ఇవ్వకపోతే గొడవ చేయడం చేస్తూ ఉండేవాడు.

ఇంటో వారు ఎంతగా అతడికి నచ్చజెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది.ఇతగాడికి ఒక లవర్‌ కూడా ఉంది.

ఆమె కోసం ఈయన చేసే ఖర్చులు అంతా ఇంతా కావు.ఏకంగా లవర్‌ను ఇంటికి తీసుకు వచ్చి, ఆమె తన సర్వస్వం అన్నట్లుగా చెప్పేశాడు.

కొడుకు చదువు పక్కన పెట్టి చెడు వ్యసనాలకు బానిస అవుతున్నాడని తల్లి రోజు బాధపడేది.తాజాగా ఒక రోజు కొడుకును తీవ్రంగా మందలించింది.

చేయి కూడా చేసుకునేందుకు ప్రయత్నించింది.దాంతో తీవ్రంగా కోపోద్రిక్తుడు అయిన జీవన్‌ తల్లిపై ఎదురు తిరిగాడు.

ఇతర కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా తల్లిపై దాడి చేశాడు.చేతికి ఏది దొరికితే దాంతో తల్లిని చితకొట్టాడు.

చీపురు కట్టతో తల్లిని కొడుతున్న సందర్బంగా ఇతర కుటుంబ దాన్ని వీడియో తీశారు.

ఆ వీడియో కాస్త వైరల్‌ అవ్వడం, జీవన్‌పై పోలీసు కేసు నమోదు అవ్వడం జరిగింది.పోలీసులు జీవన్‌ను అరెస్ట్‌ చేసి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

తన కొడుకు బాగా చెడిపోతున్నాడని, కొన్నాళ్లు అతడిని జైల్లో ఉంచాలని స్వయంగా ఆ తల్లి కోరింది.జీవన్‌ వంటి వారు ఎంతో మంది యువత చాలా దారుణంగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు.

అలాంటి వారు జీవితంలో విఫలం అవుతారు.తల్లిదండ్రుల మాటలు వినని వారు దేనికి పనికిరాకుండా పోతారు.