వీడియో: హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్.. ఆటో టైర్ కింద పడి స్పాట్‌డెడ్..

ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్‌లను ధరించడం చాలా ముఖ్యం.ఈ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కన్నతండ్రులకు కడుపు కోత మిగల్చడం ఖాయం.

 Video: Bike Riding Without Helmet.. Spotted Dead After Falling Under Auto Tire ,-TeluguStop.com

సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే భారతీయ రోడ్లపై సేఫ్‌గా ఇంటికి రావడం కష్టం.ఎందుకంటే ఇండియన్ రోడ్స్ పై ఎటువైపు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు.

అలాగే వాహనదారులు కూడా అడ్డదిడ్డంగా రోడ్డుపై ప్రయాణాలు చేస్తుంటారు.అందుకే ట్రాఫిక్ లో నెమ్మదిగా వెళ్లడం చాలా మంచిది.

అయితే ఈరోజుల్లో టీనేజర్లు థ్రిల్ కోసం ట్రాఫిక్ ఉన్న రోడ్లపై విచ్చలవిడిగా వెళుతున్నారు.ఏరోజు పాటించుకుండా, హెల్మెట్( Helmet ) కూడా ధరించకుండా తమకేమవుతుందిలే అనే ధీమాతో బైక్ రైడ్( Bike ride ) చేస్తున్నారు.

ఇదే వారి ప్రాణాల పాలిట యమపాశం అవుతోంది.

తాజాగా ఒక యువకుడు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రాణాలను కోల్పోయాడు.డిసెంబర్ 5న జరిగిన ఈ విషాద ఘటనలో కాన్పూర్‌కు చెందిన అర్జున్ అనే 17 ఏళ్ల విద్యార్థి యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.అర్జున్ 12వ తరగతి చదువుకుంటున్నాడు ఇతడు రీసెంట్‌గా ద్విచక్ర వాహనంపై వెళుతూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు, ఆ రోడ్డు చాలా బిజీగా ఉంది మధ్యలో ఒక ఆవు కూడా వెళ్తోంది.

వాటన్నిటి గుండా చాలా స్పీడ్ గా వెళ్తున్న ఈ కుర్రోడు కంట్రోల్ తప్పడు బండి వెంటనే కింద పడింది అతడి తల ఎదురుగా వస్తున్న ఆటో రిక్షా కింద పడింది హెల్మెట్ లేకపోవడం, తల రోడ్డుకు బలంగా గుద్దుకోవడం, ఆటో టైర్ కూడా తలపై నుంచి వెళ్లడం వల్ల ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.ఈ ప్రమాదం తెల్లవారుజామున 8 గంటల ప్రాంతంలో జరగగా, సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

అప్పటి నుంచి ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో( Social media ) విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ప్రమాదం జరగడానికి ముందురోజు సాయంత్రం అర్జున్ స్నేహితుడితో కలిసి పెళ్లికి ఒక పెళ్లి వేడుకకు వెళ్ళాడు.రాత్రి అక్కడ గడిపిన తరువాత, అతను మరుసటి రోజు ఉదయం పని కోసం తన స్నేహితుడి ద్విచక్ర వాహనాన్ని తీసుకున్నాడు.విషాదకరంగా తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది.

అర్జున్ హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు సీసీటీవీ వీడియోలో ఉంది.ఆ వీడియో ప్రకారం, అతను రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువును తృటిలో తప్పించాడు కానీ, మరొక వాహనాన్ని అధిగమించేటప్పుడు, నియంత్రణ కోల్పోతాడు.

అర్జున్ బైక్ నుండి పడిపోవడం, ఎదురుగా వస్తున్న ఆటో రిక్షా టైరుకు అతని తలను ఢీకొట్టడం కనిపిస్తుందిపోలీసు నివేదికల ప్రకారం, ప్రమాద స్థలంలో అర్జున్ మరణించాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఈ దురదృష్టకర సంఘటన గురించి అర్జున్ స్నేహితుడికి తెలియజేశారు.

అనంతరం అర్జున్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube