వీడియో: రిపోర్టర్‌పై బైడెన్ బూతుపురాణం.. ఆ బండబూతుతో ప్రపంచదేశాలన్నీ షాక్..!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బూతు పురాణానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.దీనిని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

 Video: Biden Whore Myth On Reporter Shock All The World , Peter Doosey, Social Media, Viral Video, Biden, Whitehouse East Room-TeluguStop.com

అధ్యక్షుడి హోదాలో ఉండి ఒక జర్నలిస్టును పచ్చి బూతులు ఎలా తిడతారు? అని అందరూ బైడెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జనవరి 24న వైట్‌హౌస్‌ ఈస్ట్‌ రూమ్‌లో జరిగిన కాంపిటీషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో బైడెన్ ఒక విలేఖరిపై నోరు పారేసుకున్నారు.

మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విధంగా ఆయన తిట్టిన తిట్టుతో సమావేశానికి హాజరైన వారంతా కూడా ఒక్కసారిగా షాకయ్యారు.

 Video: Biden Whore Myth On Reporter Shock All The World , Peter Doosey, Social Media, Viral Video, Biden, Whitehouse East Room-వీడియో: రిపోర్టర్‌పై బైడెన్ బూతు పురాణం.. ఆ బండ బూతుతో ప్రపంచదేశాలన్నీ షాక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జనవరి 24న శ్వేతసౌధంలో ధరల తగ్గింపుపై చేపట్టాల్సిన చర్యల గురించి ఒక వాడీవేడీ చర్చ జరిగింది.

ఈ చర్చలో బైడెన్ అమెరికన్ రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఫాక్స్‌ న్యూస్‌కు చెందిన వైట్‌హౌస్‌ కరస్పాండెంట్‌ పీటర్‌ డూసీ ద్రవ్యోల్బణం గురించి ఒక ప్రశ్న వేశారు.”మిడ్‌టర్మ్‌ ఎలక్షన్లపై ద్రవ్యోల్బణం అనేది రాజకీయంగా ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా ?” అని బైడెన్‌ను పీటర్‌ డూసీ ప్రశ్నించారు.అయితే సంబంధం లేని ప్రశ్న అడగడంతో బైడెన్‌ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు.ప్రశ్నకు సరిగా ఆన్సర్ చేయకుండా ఆయన సెటైరికల్ గా.” లేదు ఎక్కువ ద్రవ్యోల్బణం ఉండటమే గొప్ప ఆస్తి.వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ *****” అని బండ బూతు అనేశారు.జోక్ ఏంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మైక్‌ ఆఫ్ అయిపోయిందని బైడెన్ అనుకున్నారు.

కానీ అది ఆన్‌లో ఉండటంతో ఆయన బూతు పురాణాన్ని అందరూ వినేశారు.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో వైరల్ కావడంతో ఆయన దిద్దుబాటు చర్యకు పాల్పడ్డారు.వెంటనే ఆయన పీటర్‌ డూసీకి ఫోన్‌ కాల్ చేసి క్షమాపణలు తెలియజేశారు.“ఇది మనసులో పెట్టుకోమాకు.నిన్ను వ్యక్తిగతంగా ఏం దూషించలేదు, మిత్రమా” అని డూసీకి ఫోన్ కాల్ లో చెప్పారు.ఈ ఫోన్ కాల్ గురించి డూసీ అందరికీ తెలిపారు.“అందరూ అడుగుతున్న ప్రశ్నలకు భిన్నంగా నేను ఏదో ఒక ప్రశ్న అడుగుతాను.తాజాగా కూడా బైడెన్ ను అలాంటి ప్రశ్నే సంధించాను.

నాతో సంభాషణ కొనసాగినంత వరకూ అతను నన్ను ఎలాగైనా పిలవచ్చు.ఫోన్ కాల్ లో మా మధ్య మంచి కన్వర్జేషన్ కొనసాగింది.

అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు” అని డూసీ వెల్లడించారు.అయితే బైడెన్ నోరుజారిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.అదే వేరే దేశ అధ్యక్షుడు ఇలాంటి బూతులు తిడితే రియాక్షన్ వేరే లెవెల్ లో ఉండే దేమో అని కొంత మంది కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube