వీడియోః కరోనా భయంతో బండ్ల గణేష్‌ తండ్రికి ఏం చేశాడో చూడండి

సినిమా పరిశ్రమకు చెందిన పలువురు కరోనా బారిన పడ్డారు.అయితే రెండు సార్లు కరోనా బారిన పడ్డ వారు ఎవరు అంటే ఠక్కున వచ్చే సమాధానం బండ్ల గణేష్‌.

 Video Bandla Ganesh Doing Hair Cutting To His Father Due To Corona-TeluguStop.com

ఈయన మొదటి వేవ్‌ రెండవ వేవ్‌ కు ఈయన ఆసుపత్రి పాలయ్యాడు.రెండు సార్లు కరోనా ను చూసిన సెలబ్రెటీగా బండ్ల గణేష్‌ నిలిచాడు.

అందుకే ఈయన మళ్లీ కరోనా అంటే భయపడుతున్నాడు.అందుకే తన కుటుంబ సభ్యులను కూడా అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

 Video Bandla Ganesh Doing Hair Cutting To His Father Due To Corona-వీడియోః కరోనా భయంతో బండ్ల గణేష్‌ తండ్రికి ఏం చేశాడో చూడండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన పిల్లలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా ఇతరులతో కలువకుండా జాగ్రత్త పడుతున్నాడు.తన తండ్రి జుట్టు పెరిగితే తానే స్వయంగా కట్టింగ్‌ చేశాడు కాని బయటి వారిని పిలిచే ధైర్యం చేయలేదు.

తండ్రికి కట్టింగ్‌ చేసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

తండ్రికి కట్టింగ్‌ చేస్తున్న వీడియో ను బండ్ల గణేష్‌ షేర్‌ చేయడంతో అంతా కూడా అభినందిస్తున్నారు.

ఈ సమయంలో ప్రతి ఒక్కరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా ముసలి వారు సమాజానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కట్టింగ్‌ పేరుతో ఆయన్ను ఎవరి వద్దకు తీసుకు వెళ్లకుండా మీరే ట్రిమ్మింగ్‌ చేయడం అభినందనీయం.మీరు మీ తల్లిదండ్రులు కరోనా ఫ్రీగా ఉండేందుకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు బండ్ల గణేష్‌ అన్నా నువ్వు తోపు, నీవే నిజమైన పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్‌ వి అంటూ అభినందిస్తున్నారు.ఇక బండ్ల బాబు సినిమాల విషయానికి వస్తే నిర్మాతగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

అయితే నటుడిగా మాత్రం గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

#Social Media #Bandla Ganesh #Corona #Bandla Twitter #BandlaGanesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు