వీడియో : ఆహా, ఏమి ఆ డ్యాన్స్.. మాధురీ దీక్షిత్ పాటకు చించేసిన బంగ్లాదేశీ వధువు..!

ఈ రోజుల్లో డ్యాన్స్ లేకపోతే వెడ్డింగ్స్ పూర్తి కావడం లేదు.వధువు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ వారిని ఆశ్చర్య పరచడం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది.

 Video Aha, What's That Dance  Bangladeshi Bride Who Was Offended By Madhuri Dixi-TeluguStop.com

సాంప్రదాయ పెళ్లి వస్త్రాల్లో నిండుగా కనిపిస్తూ అదిరిపోయే స్టెప్పులేసిన వధువులను చూసేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.సోషల్ మీడియా ప్రభంజనంతో వధూవరుల డ్యాన్స్ వీడియోలు అందరికీ చేరువవుతూ పులకింప చేస్తున్నాయి.

తాజాగా బంగ్లాదేశీ వధువు వీడియో కూడా ఇండియాలో వైరల్ గా మారింది.ఎందుకంటే ఈ పెళ్లి కూతురు తన హల్దీ సెరిమోనీలో మన ఇండియన్ సాంగ్‌కే కాలు కదిపింది.

షారుఖ్ ఖాన్ మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్ నటించిన దేవ్ దాస్ సినిమాలో ‘కాహే చ్చేడ్ మోహే’ అని సాగే పాటకు బంగ్లాదేశీ వధువు గ్రేస్ ఫుల్, ఆకర్షణీయమైన స్టెప్పులతో చించేసింది.ఒరిజినల్ పాటలో తబలా వాయిస్తుంటే మాధురీ దీక్షిత్ నర్తిస్తుంది.

వైరల్ ఐన వీడియోలో మనం బాలీవుడ్‌తో పాటు వారు కూడా ఒక చిన్న స్టేజ్ పై డ్యాన్స్ స్టెప్పులు వేయడం చూడొచ్చు.నిజానికి వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్ డ్యాన్సర్ అట.అందుకే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మాధురీ దీక్షిత్ అంటే అద్భుతంగా డ్యాన్స్ చేసి బంధు మిత్రులతో పాటు నెటిజన్లందరినీ ఫిదా చేస్తున్నారు.ఈ వీడియోలో వధూవరులిద్దరూ ఒకే లయలో ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫెక్ట్ గా చేయడం చూడొచ్చు.

వారు ఐదు నిమిషాల పాటు ఒకరికొకరిని ఫాలో అవుతూ ఒకే లయలో డ్యాన్స్ చేశారట.ఈ విషయాన్ని aaloogobi అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ వెల్లడించింది.

ఈ వీడియో ని షేర్ చేస్తూ.ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డ్యాన్స్ చేసినట్టు వధూవరులు చెప్పినట్లు ఈ పేజీ తెలిపింది.

ఆహా, ఏమి ఆ డ్యాన్స్ అంటూ ఇండియన్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.లవ్లీ పర్ఫామెన్స్ అంటూ కితాబిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube