తమిళనాడులో ఆగని నారప్ప పోరాటం...

సినిమా పరిశ్రమలో హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకునే హీరో విక్టరీ వెంకటేష్.అయితే తాజాగా వచ్చినటువంటి వెంకీ మామ చిత్రంలో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి తన సత్తా ఏంటో చూపించాడు వేంకటేష్.

 Victory Venkatesh Narappa Movie Update-TeluguStop.com

అయితే ప్రతుతం విక్టరీ వెంకటేష్ నటిస్తున్నటువంటి చిత్రం నారప్ప.ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినటువంటి అసురన్ చిత్రానికి రీమేక్ గా ఉంది.అయితే ఇప్పటికే ఈ చిత్ర అ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకాగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.అంతేకాకుండా ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

అయితే ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర పరిసర ప్రాంతంలో  కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరణ  జరుపుకుంటున్నాయి.అయితే ఈ తమిళనాడు షెడ్యూల్ తర్వాత మరో కీలక షెడ్యూల్  రాయలసీమ ప్రాంతం అయినటువంటి అనంతపురం జిల్లాలో చిత్రీకరణ జరిపేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Telugu Ppa, Ppa Priyamani, Ppa Vitory, Priyamani, Varsha Bollamma-Movie

అయితే ఈ చిత్రంలో ప్రముఖనటి ప్రియమణి నటిస్తుండగా మరో ప్రాధాన్యత ఉన్న పాత్రలో విజిల్ సినిమాలో ఫుడ్ బాల్ ప్లేయర్ గా మెప్పించినటువంటి వర్ష బొల్లమ్మ నటిస్తోంది.ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.అలాగే  విలక్షణ సంగీత దర్శకుడు మణి శర్మ స్వరాలను సమకూరుస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube