ప్రస్తుతం హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న నారప్ప...   

Victory Venkatesh Narappa Movie Shooting Update - Telugu Narappa Movie Latest News, Narappa Movie Shooting Update, Narappa Movie Update, Priyamani Movie News, Priyamani News, Venkatesh New Movie News

తమిళంలో స్టార్ హీరో ధనుష్ నటించిన టువంటి అసురన్ చిత్రం ఎంత మంచి విజయం సాధించిందో మనందరికీ బాగా తెలుసు.అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.

Victory Venkatesh Narappa Movie Shooting Update - Telugu Narappa Movie Latest News, Narappa Movie Shooting Update, Narappa Movie Update, Priyamani Movie News, Priyamani News, Venkatesh New Movie News-Latest News-Telugu Tollywood Photo Image

ఈ చిత్రంలో హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియామణి, రెబ్బ మౌనిక జాన్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

అయితే మొన్నటి వరకు ఎర్రటి ఎడారిలో పలు యాక్షన్ సీన్లను వెంకటేష్ తో కలిసి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.ఇందుకు గాను ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నటి ప్రియమణి కూడా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటోంది.

అలాగే పలు ఎమోషనల్ సీన్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 60 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది.దీంతో దర్శకుడు ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

తాజా వార్తలు