ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిగా ఆ బాలీవుడ్ హీరోను ఫైనల్ చేశారట!

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అప్పటి నుండి వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

 Vicky Kaushal As Lakshmana In Adipurush Movie-TeluguStop.com

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా షూటింగ్ స్టార్ట్ చేసాడు.

ఒక వైపు సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే మరో వైపు ఆది పురుష్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేసారు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.

 Vicky Kaushal As Lakshmana In Adipurush Movie-ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిగా ఆ బాలీవుడ్ హీరోను ఫైనల్ చేశారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Telugu Adipurush Movie, Lakshmana, Lakshmana Character, Om Rout, Prabhas, Saif Ali Khan, Vicky Kaushal-Movie

అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం కృతి సనన్ ను ఎంపిక చేసుకున్నారు.అయితే ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కోసం ఎప్పటి నుండో వెతుకుతున్నారు.అయితే ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అందుకే ఈ పాత్ర కోసం యువ హీరోను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

లక్ష్మణుడి పాత్ర కోసం బాలీవుడ్ హీరో వికీ కౌషల్ ను ఫైనల్ చేసారని టాక్ వస్తుంది.3డి విజువల్ గ్రాఫిక్స్ తో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఆగస్టు 11 2022 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

అయితే సలార్ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు ప్రభాస్.

ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించారు.

#Prabhas #Lakshmana #Saif Ali Khan #Om Rout #Vicky Kaushal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు