రైతు ఉద్యమంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు..!!

గత కొంత కాలం నుండి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు కొన్ని నెలల నుండి రైతు సంఘాలు ఆందోళనలు, నిరసనలు చేపడుతూ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు.

 Vice President Sensational Comments On Farmers Protest In Delhi, Farmer Movement-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రైతు సంఘాల తో 11 సార్లు సమావేశాలు అయినా గాని చర్చలు కొలిక్కి రాలేదు.ఏ మాత్రం కొత్త చట్టాలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.

మరోవైపు రైతులు చేస్తున్న ఉద్యమంలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని దారుణమైన సంఘటనలు అదేవిధంగా ఉగ్రవాద ప్రేరేపిత గుంపులు కూడా చొరబడటం తో ఈ సమస్య దేశానికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.ప్రపంచంలో ఇతర దేశాల నాయకులు దేశంలో రైతులు చేసిన ఉద్యమం పై రక రకాలుగా స్పందిస్తున్నారు.

ఈ విషయంలో ఇప్పటికే మోడీ మరియు కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో దేశం పరువు తీస్తున్నారని స్పందించడం జరిగింది.ఇలాంటి తరుణంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రైతుల ఉద్యమంపై స్పందించారు.

“ రైతుల ఆందోళన మరియు ప్రతిష్టంభన ఏమాత్రం దేశానికి మంచిది కాదని స్పష్టం చేశారు.సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని ఇందుకోసం రెండు పక్షాలు ఆలోచించాలని పేర్కొన్నారు.

అంత మాత్రమే కాక ప్రస్తుత ప్రపంచంలో మారుతున్న ఆధునిక సాంకేతిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు.మొత్తం మీద రైతుల ఉద్యమం విషయంలో అటు కేంద్రానికి అదేవిధంగా రైతు సంఘాలకు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చురకలు గట్టిగానే అంటించారు. 

Telugu Delhi, Farmers, Modi, Venkaiah-Political .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube