ఆప్ఘనిస్తాన్‌లో చావు దెబ్బ.. మసకబారుతున్న అమెరికా ప్రభ, ఆసియా టూర్‌కి కమలా హారీస్

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడంతో తాలిబన్లు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.అత్యంత సులభంగా, ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను వారు హస్తగతం చేసుకున్నారు.

 Us Vice President Kamala Harris Begins Asia Trip Amid Afghanistan Debacle, Afgha-TeluguStop.com

ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దీంతో అన్ని వైపుల నుంచి అమెరికాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పలు దేశాల్లో అగ్రరాజ్యం పరపతి పడిపోయినట్లుగా సర్వేలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారీస్ రంగంలోకి దిగారు.

ఈ రోజు నుంచి ఆమె ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు.దీనిలో భాగంగా సింగపూర్, వియత్నాంలలో కమలా హారీస్ పర్యటన సాగనుంది.

సోమవారం సింగపూర్ నాయకత్వాన్ని ఆమె కలవడం ద్వారా అధికారికంగా పర్యటన ప్రారంభం కానుంది.
ప్రస్తుత ఆఫ్ఘన్ సంక్షోభాన్ని 1975 నాటి సైగాన్ ఘటనతో విశ్లేషకులు పోల్చిచూస్తున్నారు.

యూఎస్ హెలికాఫ్టర్లు నాడు.ఎంబసీ పైకప్పు నుంచి దౌత్య వేత్తలు, పౌరులను తరలించిన విషయాన్ని అనేక మంది గుర్తుచేస్తున్నారు.

అయితే ఆఫ్ఘన్‌లో అమెరికా పరాజయానికి ముందే కమలా హారిస్ పర్యటన ఖరారైందనని యూఎస్ అధికారులు చెప్పారు. ఆసియాలో వాషింగ్టన్ విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలపై ఆమె దృష్టి పెట్టినట్లు వారు తెలిపారు.

Telugu Afghanistan, America, Asia, Kamalaharris, Kamala Harris-Telugu NRI

మరోవైపు ఇండో – పసిఫిక్ ప్రాంతంలో అమెరికా రాజకీయ ఆధిపత్యం, నౌకాదళ ఆధిపత్యాలను చైనా సవాలు చేస్తున్న సమయంలో కమలా హారీస్ ఆగ్నేయాసియా దేశాల పర్యటన వ్యూహాత్మకమైనదని ఓ వైట్ హౌస్ అధికారి తెలిపారు.10 దేశాల మధ్య ప్రాంతం అమెరికా- చైనాల ప్రభావానికి గురవుతున్న నేపథ్యంలో బీజింగ్ వాదనలను వాషింగ్టన్ పలుమార్లు విమర్శించింది.నాలుగు ఆగ్నేయాసియా దేశాలైన బ్రూనై, మలేషియా, ఫిలిప్పిన్స్, వియత్నాంతో పాటు తైవాన్‌లు బీజింగ్ చర్యలతో ప్రభావానికి గురవుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఓటమి తర్వాత అమెరికా విశ్వసనీయత, పరపతిని పెంచాల్సిన అవసరం వాషింగ్టన్‌పై వుంది.

దీనిలో భాగంగానే కమలా హారీస్ పర్యటనకు వస్తున్నారని సింగపూర్ కన్సల్టెన్సీ సోలారిస్ స్ట్రాటజీస్ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు ముస్తఫా ఇజుద్దీన్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube