వైరల్ వీడియో: క్యాచ్ పట్టుకున్న విధానం చూసి ఆమెను లేడీ జాంటి రోడ్స్ అంటున్న నెటిజన్లు..!

భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతాలు సృష్టిస్తోంది.బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది.

 Vice Captain Harman Preet Kaur Amazing Catch Vs England In Icc Women World Cup D-TeluguStop.com

వర్తమాన క్రికెట్‌లో టీమిండియా మహిళా క్రికెటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మన మహిళా క్రికెటర్ల ఆటతీరు అందరినీ ఆకర్షిస్తోంది.తాజాగా భారత వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పట్టిన క్యాచ్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

*హర్మన్ ప్రీత్‌ కౌర్‌పై ప్రశంసలు*

ప్రస్తుతం ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో ఉంది.బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది.బ్యాటింగ్ లైనప్ తీవ్రంగా విఫలం కావడంతో ఓటమి ఎదురైంది.అయితే ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ పట్టిన క్యాచ్ సంచలనంగా మారింది.ఇంగ్లాండ్ బ్యాటర్ అమీ జోన్స్ బ్యాటింగ్ చేస్తుండగా భారత స్పిన్సర్ రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ చేస్తోంది.

అమీ జోన్స్ ఓ బంతి మిడ్ ఆన్ దిశగా బలంగా బాదింది.ఆ బాల్‌ను హర్మన్ ప్రీత్ కౌర్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుంది.

ఓ చేతితో క్యాచ్ అందుకున్నా, శరీరాన్ని విల్లులా వంచి పల్టీ కొట్టి మరీ ఆ క్యాచ్‌ను అందుకుంది.ఏ మాత్రం నియంత్రణ కోల్పోకుండా, అటు బాల్‌ను కూడా వదలకుండా చక్కటి క్యాచ్ అందుకుంది.

*మ్యాచ్ ఫలితం తల్లకిందులు*

ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లలోనూ పరాజయం పాలైంది.అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.మరో వైపు భారత జట్టు పేలవమైన ఆటతీరుతో కనబర్చడంతో నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌పై విజయం సాధించింది.ముఖ్యంగా భారత బ్యాటర్లు 36.2 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేయగలిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube