వయాగ్రా వాడటం వలన ఆ జబ్బు వస్తుందా ?  

Can Lead To Skin Cancer?-

పురుషులకి ఉండే సెక్స్ సమస్యల్లో అతిపెద్ద సమస్య అంగం స్తభించకపోవడం.దీనికి విరుగుడు ఏమిటంటే సింపుల్ గా వయాగ్రా అని చెప్పేస్తారు.

అంత ఫేమస్ మరి వయాగ్రా.కాని ఇది వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే ఉంటాయి, కాని ఆ ఊపులో లేనిపోనివి అపోహలు కూడా సృష్టిస్తారు.

 Can Lead To Skin Cancer?- --

అలాంటి ఒక అపోహే వయాగ్రా వాడటం వలన స్కిన్ క్యాన్సర్ వస్తుందని చెప్పడం.ఇప్పటిదాకా ఉన్న ఈ అపోహ ప్రకారం వయాగ్రా వాడటం శరీరంలో మేలనోమ ఉత్పత్తి అవుతుంది, దీని వలన స్కిన్ క్యాన్సర్ వస్తుంది.

కాని అలాంటిదేమీ జరగదని తాజాగా జరిగిన ఒక అధ్యయనం తేల్చిచెప్పింది.

NYU లంగోన్ మెడికల్ సెంటర్ నిర్వహించన ఒక రీసర్చ్ లో వయాగ్రా వలన స్కిన్ క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని నిరూపితమైంది.

8 లక్షలకు పైగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నవారి మెడికల్ రిపోర్ట్స్ ని, అందులో మేలనోమా ఎక్కువ కలిగిన 40 వేల మగవారి మెడికల్ రిపోర్ట్స్ ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాతనే ఈ విషయాన్ని బయటపెట్టారు రిసర్చర్స్.వయాగ్రా వలన తలనొప్పి, వాంతులు ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, స్కిన్ క్యాన్సర్ వచ్చేంత ప్రమాదమైతే లేదట.

భగభగ మండే ఎండల్లో ఎక్కువగా తిరగడం, కాస్మోటిక్ ప్రాడక్ట్స్ ఎక్కువ వాడటం వలన స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది కాని వయాగ్రా వలన కాదు అని చెబుతున్నారు అధ్యయనం చేసినవారు.“కొత్త, పాత, ఏ మెడిసిన్ అయినా సరే, కొన్ని నిజాలు తెలుస్తాయి, అలాగే కొన్ని అపోహలు మొదలవుతాయి.

వయాగ్రా వలన స్కిన్ క్యాన్సర్‌ అనేది అపోహే.ప్రపంచంలో ఎంతోమంది వయాగ్ర వాడుతున్నారు.అందరికి స్కిన్ క్యాన్సర్ రావడం లేదు కదా.యూవి రేస్ కి ఎక్కువగా చర్మాన్ని చూపించినా, పిచ్చి పిచ్చి కాస్మోటిక్ ప్రాడక్ట్స వాడినా స్కిన్ క్యాన్సర్ వస్తుంది.

అది గుర్తుపెట్టుకుంటే చాలు” అంటూ చెప్పుకొచ్చారు రిసర్చర్ వేన్ బరోన్.

తాజా వార్తలు

Can Lead To Skin Cancer?- Related....