నలుగురు కమెడియన్స్ ని నమ్ముకున్న టాలెంటెడ్ దర్శకుడు  

సందీప్ కిషన్ టైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి విఐ ఆనంద్.మొదటి సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు రెండో సినిమాని అల్లు శిరీష్ తో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ జోడించిన కథాంశంతో సినిమా చేశాడు.

TeluguStop.com - Vi Anand Next Movie With Four Comedians

ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.తరువాత నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఈ సినిమాకి హర్రర్ కథాంశం తీసుకొని దానికి కాస్తా ఫిక్షన్ మిక్స్ చేసి, లవ్ స్టోరీగా తెరకెక్కించారు.నిఖిల్ కెరియర్ లో ఇది ఓ బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.

TeluguStop.com - నలుగురు కమెడియన్స్ ని నమ్ముకున్న టాలెంటెడ్ దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత ఏకంగా మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేసే అవకాశాన్ని విఐ ఆనంద్ సొంతం చేసుకున్నాడు.ఇది కూడా విభిన్న ఎలిమెంట్ తో తెరకెక్కించిన సినిమానే.

చనిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోస్తే అనే కాన్సెప్ట్ చేసిన ఈ సినిమాలో రొటీన్ రివేంజ్ డ్రామా జోడించడం వలన డిజాస్టర్ అయ్యింది.ఈ డిజాస్టర్ ఎఫెక్ట్ తో కొంత గందరగోళంలో పడ్డ విఐ ఆనంద్ మళ్ళీ తనకి అలవాటైన ట్రాక్ లోకి వచ్చి సినిమా చేయబోతున్నాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ విఐ ఆనంద్ తో సినిమా చేయబోతుంది.ఓ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా విఐ ఆనంద్ చెప్పబోతున్నాడు.

దీనికోసం నలుగురు కమెడియన్స్ ని లీడ్ రోల్ కోసం తీసుకుంటున్నాడు.అందులో రెండు పాత్రల కోసం సత్య, శ్రీనివాసరెడ్డిని ఫైనల్ చేశారు.మరో రెండు పాత్రల కోసం కూడా స్టార్ కమెడియన్స్ ని తీసుకునే పనిలో ఉన్నాడు.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు.

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

#Four Comedians #Geeta Arts2 #Bunny Vaas #VI Anand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు