రేవంత్ పై సంచ‌ల‌న కామెంట్లు చేసిన వీహెచ్‌.. ఇంకా అసంతృప్తిలోనే..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌న్ని లుక‌లుక‌లు ఇంకా ఏ పార్టీలో కూడా ఉండ‌వేమో అనిపిస్తుంది.ఎందుకంటే రీసెంట్గా రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్ర‌క‌టిస్తే ఎన్ని ర‌కాలుగా సొంత పార్టీకి చెందిన సీనియ‌ర్లు నిర‌స‌న వ్య‌క్తం చేశారో చూస్తూనే ఉన్నాం.

 Vh Who Made Sensational Comments On Rewanth Still Dissatisfied, Revanth, Hanuman-TeluguStop.com

కాగా ఇప్పుడు రేవంత్ ప్రెసిడెంట్ అయ్యాక వారిని క‌లుపుకుని పోయేందుకు వారు ఎన్ని కామెంట్లు చేసినా కూడా ప‌ట్టించుకోకుండా వారిని ఇండ్ల‌కు వెళ్లి మరీ క‌లిసి త‌న‌కు మ‌ద్ద‌తుగా రావాల‌ని కోరారు.ఇక ఇదే క్ర‌మంలో సీనియ‌ర్ అయిన వీ హ‌నుమంత‌రావు రేవంత్‌ను వ్య‌తిరేకిస్తూ ఎన్నిర‌కాలుగా నిర‌స‌న తెలిపారో అంద‌రికీ తెలిసిందే.

కాగా ఆయ‌న నిర‌స‌న‌ల‌పై ఎప్పుడూ రేవంత్ కూడా పెద్ద‌గా మాట్లాడ‌లేదు.ఇక రేవంత్ ప్రెసిడెంట్ అయ్యాక ఏకంగా ఆస్ప‌త్రికి వెళ్లి మీర వీహెచ్‌ను ప‌రామ‌ర్శించారు.ఎందుకంటే వీహెచ్ అనారోగ్యంతో బాధపడుతున్న‌ప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే.ఇక రీసెంట్‌గా కోలుకున్న వీహెచ్ శనివారం రోజున మీడియా ముందుకు వచ్చి అనేక విష‌యాల‌పై మాట్లాడారు.

తాను ఆస్ప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో ప‌రామ‌ర్శించ‌డానికి చాలా మంది వచ్చారని వారికి ధ‌న్య వాదాలు తెలిపారు వీహెచ్.ఇక ఇదే క్ర‌మంలో రేవంత్‌, కొత్త క‌మిటీల‌పై కూడా ఆయ‌న మాట్లాడారు.

Telugu Hanumantharao, Revanth, Sonial Gandhi, Ts-Telugu Political News

తెలంగాణ‌లోని బడుగు బలహీన వర్గాల ప్ర‌జ‌ల‌కు త‌న సేవ‌లు ఎంతో అవసర‌మ‌ని, అందుకే ఈ వ‌య‌స్సులో కూడా సేవ చేస్తున్న‌ట్టు వివ‌రించారు.కాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ధైర్యం చెప్ప‌డంతోనే తాను త్వరగా కోలుకోగలిగానని, ఇకా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోస‌మే త‌న మిగ‌తా జీవితాన్ని అంకితం చేస్తానని స్ప‌స్టం చేశారు ఆయ‌న‌.అలాగే తాను సోనియా గాంధీతో మీట్ అయి పూర్తిగా మాట్లాడిన త‌ర్వాతే కొత్త ప్రెసిడెంట్‌, కొత్త‌కమిటీల‌పై మాట్లాడుతాన‌ని, అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కామెంట్లు చేయ‌న‌ని చెప్పారు.దీతో ఆయ‌న ఇంకా అసంతృప్తిలోనే ఉన్నార‌ని, రేవంత్ స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించినా కూడా వీహెచ్ అల‌క వీడ‌లేద‌నే చ‌ర్చ కాంగ్రెస్‌లో సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube