మొత్తానికి వీహెచ్ రాయ‌బారం ఫ‌లించిందే.. కాంగ్రెస్‌లో ఇక కొత్త జోష్‌

తెలంగాణ కాంగ్రెస్ అంటేనే వ‌ర్గ విభేదాల‌కు పెట్టింది పేరు అనే విధంగా ఉండేది.అలాంటి పార్టీలోని నాయ‌కుల‌ను ఒక్క తాటిమీద‌కు తేవ‌డం అంటే క‌త్తి మీదు సాము లాగే ఉంటుంది.

 Vh Mission Was The Result Of A New Josh In Congress Details, Congress, Vh Hanuma-TeluguStop.com

ఇక‌పోతే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ రేసులోకి వ‌చ్చారో అప్ప‌టి నుంచే ఆయ‌న మీద సొంత పార్టీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.ఆయ‌న‌కు ఇస్తే పార్టీ నుంచే త‌ప్పుకుంటామ‌ని ప్ర‌క‌టించిన వారు కూడా ఉన్నారు.

అయితే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఈ వ‌రుస‌లో ముందున్నార‌నే చెప్పాలి.ఇక అంద‌రూ ఊహించ‌న‌ట్టుగానే రేవంత్‌కు ప‌గ్గాలు ఇవ్వ‌డంతో కోమ‌టి బ్ర‌ద‌ర్స్ తీవ్ర అసంతృప్తిలోనే ఉంటున్నారు.

నిజానికి కాంగ్రెస్ లో కోమ‌టి బ్ర‌ద‌ర్స్‌కు మంచి ప‌ట్టుంది.తూర్పు జిల్లాల‌పై వారి హ‌వా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

అందుకే వారిని మ‌ళ్లీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేలా చేయాల‌ని ఎంతోమంది ప్ర‌య‌త్నించారు.అయితే కోమ‌టి మాత్రం తాను గాంధీ భ‌వన్ మెట్లు ఎక్క‌బోనంటూ ప్ర‌క‌టించేశారు.

అయినా స‌రే ఆయ‌న్ను మ‌ళ్లీ రేవంత్ తో క‌ల‌పాల‌ని ఎంతోమంది ట్రై చేసినా చివ‌ర‌కు ఫెయిల్ అయ్యారు.ఇలాంటి క్ర‌మంలోనే హ‌నుమంత‌రావు రాయ‌బారాన్ని భుజాన వేసుకున్నారు.

తాను కోమ‌టి రెడ్డిని ఒప్పిస్తానంటూ రంగంలోకి దిగిపోయారు.

Telugu Congress, Congressvari, Komatireddy, Revanth Reddy, Senior Congress, Tela

అయితే పెద్దాయ‌న ప్ర‌య‌త్నాలు మాట‌ల‌కు ఎట్టకేలకు కోమటిరెడ్డి కరిగిపోయార‌నే చెప్పొచ్చు.ఈ నేప‌థ్యంలో రైతుల వ‌రి ధాన్యం కొనాలంటూ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ధర్నా చౌక్ వ‌ద్ద చేప‌ట్టిన వరి దీక్షకు కోమ‌టిరెడ్డి హాజ‌ర‌య్యారు.రేవంత్ పార్టీ చీఫ్ అయిన త‌ర్వాత ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మంలో రేవంత్ తో పాల్గొన‌డం ఇదే మొద‌టిసారి.

ఇక ఈ దీక్ష‌కు కాంగ్రెస్ నేత‌లు మొత్తం వ‌చ్చేశారు.తాను ఒక ఉద్యమ నేతగా అలాగే రైతు బిడ్డగా ఈ దీక్ష‌కు వ‌చ్చానంటూ చెప్ప‌డం గ‌మనార్హం.అయితే ఈ కార్య‌క్ర‌మంలో రేవంత్‌, కోమ‌టిరెడ్డి ప‌క్క ప‌క్క‌నే కూర్చుని మాట్లాడుకోవ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube