సీఎం కేసీఆర్‌కు వీహెచ్‌ లేఖ..!

కోవిడ్-19 కష్టకాలంలో ప్రజలకు తమ సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు.

 Vh Letter, Cm Kcr, Hanumanth Rao , V Hanumantha Rao Letter To Kcr-TeluguStop.com

రాష్ట్రంలో కోవిడ్ శర వేగంగా విస్తరిస్తుందని, కరోనా కట్టడిలో నిరంతరం శ్రమిస్తున్న వారిని గుర్తించి వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలన్నారు.

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్నకరోనా వైరస్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా వ్యాప్తి, నిర్మూలన చర్యలు, కాంట్రాక్ట్ వైద్యుల రెగ్యూలరైజేషన్, వైద్యశాఖలో పోస్టుల భర్తీ వంటి అంశాలపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.

కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.

రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులను, నర్సులను రెగ్యూలరైజ్ చేసి దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.అలాగే వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీ పోస్టులను, అధనంగా మరి కొన్ని కొత్త పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.

కరోనా కారణంగా కేసులు సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుందని, వైద్యులు, సిబ్బందిలో చాలా మంది కరోనా బారినపడ్డారు.కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వైద్యుల సంఖ్య పెంచితే మెరుగైన సేవలు అందించగలమని అభిప్రాయం.

రాష్ట్రంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.కరోనా కష్టకాలంలో ఉన్నాం కాబట్టి వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు పూర్తి స్థాయిలో అనుభవం సంపాదించాలి.

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అధికారులు, పోలీసులు చేపడుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, కరోనా కట్టడికి పారిశుద్ధ్య కార్మికుల సేవలు కొనియాడలేనిదన్నారు.

కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వేలాది మందిని క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ విషయంపై ఆలోచించాలి.

ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించి, సామాజిక దూరం పాటించాలంటూ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube