కాంగ్రెస్‌లో రాయ‌బారాలు మోస్తున్న వీహెచ్‌.. ఫ‌లితం ఉంటుందా..?

తెలంగాణ కాంగ్రెస్ అంటేనే వ‌ర్గాల‌కు పెట్టింది పేరు.అక్క‌డ ఒక విధానం మీద అంద‌రూ క‌లిసి రావ‌డం అంటే పెద్ద స‌వాలే.

 Vh Carrying Embassies In Congress Will There Be A Result, Hanumantha Rao, Congre-TeluguStop.com

ఎవ‌రికి వారే వ‌ర్గాలుగా విడిపోయి మ‌రీ రాజ‌కీయాలు చేస్తుంటారు.అందుకే వారి మీద వ‌చ్చిన‌న్ని విమ‌ర్శ‌లు ఇంకే పార్టీ మీద కూడా రావు.

పైగా సొంత‌పార్టీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌డంలో కాంగ్రెస్ త‌రువాతే ఏ పార్టీ అయినా ఉంటుంది.ఇప్పుడు తెలంగాణ‌లో ఇది మ‌రింత బ‌లంగా వినిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జ‌గ్గారెడ్డి, వీహెచ్ లాంటి నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు.

అయితే రేవంత్ మాత్రం వారిని వీలైనంత క‌లుపుకుని పోయేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు.

ఇక ఢిల్లీ నాయ‌క‌త్వం కూడా రేవంత్ ను టార్గెట్ చేయ‌డంపై సీరియ‌స్ గానే ఉంది.దీంతో అంద‌రూ కొంచెం సైలెంట్ అయిపోయారు.ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రాల క‌మిటీ వీహెచ్ ను క‌లిసి పార్టీ కోసం క‌లిసిరావాలంటూ కోరింది.దీంతో ఆయ‌న కూడా ఒప్పుకుంటున్నారు.

పైగా రాయ‌బారిగా మారుతానంటూ చెప్పేస్తున్నారు.ముఖ్యంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డిల‌ను క‌లిసి దారిలోకి తేవాలంటూ క‌మిటీ ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

Telugu Congress, Delhi Congress, Hanumantha Rao, Jaggaredyy, Komatireddy, Revant

ఇక ఆయ‌న కూడా రంగంలోకి దిగిపోయారంట‌.కానీ అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని ఢిల్లీ నాయ‌క‌త్వ‌మే ఇంకా పూర్తి స్థాయిలో దారిలోకి తీసుకురాలేక‌పోతోంది.అలాంటి వీహెచ్ కూడా తెలంగాణ‌లో మొద‌ట అస‌మ్మ‌తి నేత‌గా ఉన్నారు.అలాంటి ఆయ‌న చెబితే వెంక‌ట్ రెడ్డి బ్ర‌ద‌ర్స్ వింటారా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.రేవంత్ ను తీవ్రంగా విమ‌ర్శించిన వారిలో వీహెచ్ కూడా ఉన్నారు.ఇక ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని కూడా అగ్ర నాయ‌క‌త్వం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే వాద‌న ఉంది.

మ‌రి వీహెచ్ పూర్తి స్థాయిలో కోమ‌టి బ్ర‌ద‌ర్స్‌ను మారుస్తారా లేదా అన్న‌ది మాత్రం వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube