బాలీవుడ్ సంగీత దర్శకుడు రవి కన్నుమూత

ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసుకు జాతీయ అవార్డు సంపాదించి పెట్టిన సిన్మా చిత్ చోర్ గుర్తు ఉందా? అందులోని పాటలు సూపర్ హిట్స్.గోరి తేరి గావ్ బడా ప్యారా పాటకే ఏసుదాసుకు జాతీయ అవార్డు వచ్చింది.

 Legendary Musician Ravindra Jain Dies In Mumbai-TeluguStop.com

ఆ సిన్మా సంగీత దర్శకుడు రవీంద్ర జైన్.బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చారు.ఆ ప్రముఖ సంగీత దర్శకుడు కన్ను మూశారు.71 సంవత్సరాల రవి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో తుది శ్వాస వదిలారు.యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా మూత్ర పిండాలు దెబ్బ తిన్నాయి.చోర్ మచాయే షార్, గీత్ గాతా చల్, అఖియోన్కే ఝారోఖోంసే, రామ్ తేరి గంగా మెయిలీ, దో జాసూస్, హీనా ….

మొదలైన ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించారు.సరిగా ఆడని సినిమాల్లో కూడా పాటలు హిట్ అయ్యాయి.రవికి మన తెలుగు రాష్ట్ర్రాల్లో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు.ప్రధానంగా హిందీ సినిమాలు ఎక్కువగా ఆడే హైదరాబాదులో అభిమానులు చాలామంది ఉన్నారు.1970 దశకంలో రవి పాటలు సినిమా అభిమానులను ఉర్రూతలూపాయి.రవి కొన్ని టీవీ సీరియళ్ళకు కూడా సంగీతం అందించారు.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే రవి అంధుడు.కానీ ఆయన ప్రతిభకు అంధత్వం అడ్డు కాలేదు.

ఆయన కేవలం సంగీత దర్శకుడే కాదు, పాటల రచయిత కూడా.ఒక సంగీత విభావరి కోసం ప్రయాణం అవుతున్న సమయంలోనే ఆయన కన్ను మూశారు.

రవి ఆత్మకు శాంతి కలగాలని తెలుగు స్టాప్ ప్రార్ధిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube