టూ మచ్ రా..! అంటూ బ్రహ్మాజీ ఫోటోపై కామెంట్ చేసిన హీరోయిన్

తెలుగులో పలు విలన్ ఓరియెంటెడ్ మరియు కామెడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు “బ్రహ్మాజీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను సరదాగా అలరిస్తుంటాడు.

 Veteran Heroine Tabu Comments On Brahmaji Photo Viral-TeluguStop.com

అయితే తాజాగా నటుడు బ్రహ్మాజీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఫోటో ని షేర్ చేశాడు.దీంతో కొందరు సినీ సెలబ్రిటీలు ఈ ఫోటో పై స్పందిస్తూ సరదాగా కామెంట్లు చేశారు.

కాగా బ్రహ్మాజీ ఫోటో పై టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ టబు కూడా స్పందించింది.ఇందులో భాగంగా “ఉఫ్…  టూ మచ్ రా…” అంటూ కామెంట్ చేసింది.

 Veteran Heroine Tabu Comments On Brahmaji Photo Viral-టూ మచ్ రా.. అంటూ బ్రహ్మాజీ ఫోటోపై కామెంట్ చేసిన హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో బ్రహ్మాజీ కూడా “వామ్మో…”  అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.ఇక టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ కూడా ఈ ఫోటోపై స్పందిస్తూ “కంటి చూపు కాదు కొంటె చూపు” అంటూ కొంతమేర కొంటెగా కామెంట్ చేశాడు.  దీంతో ఈసారి బ్రహ్మాజీ తనదైన శైలిలో స్పందిస్తూ “ఏంటో అన్ని నీ చూపులే” అంటూ రీ కౌంటర్ ఇచ్చాడు.దీంతో ప్రస్తుతం వీరి కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బ్రహ్మాజీ తెలుగులో “తిమ్మరుసు” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో బ్రహ్మాజీ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా తెలుగు యంగ్ హీరో సత్యదేవ్ మరియు టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ నటిస్తుండగా నూతన దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ లభించింది.

దీంతో ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Tabu #Brahmaji #TabuComments #VeteranHeroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు