బాలయ్య సినిమాలో కీలక పాత్రలో మీనా

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో సారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

 Veteran Heroine Meena Romance With Balakrishna, Tollywood, Boyapati Srinu, Telug-TeluguStop.com

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.బాలకృష్ణ కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా దీనిని బోయపాటి తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ సినిమా ఆంటే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి.అలాగే సినిమాలో బాలకృష్ణకి జోడీగా ఎవరు నటించబోతున్నారు అనే విషయాలపై ఆసక్తి ఉంటుంది.

ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా బాలయ్య హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు వినిపించాయి.అయితే ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.

ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న బాలకృష్ణ పాత్రలలో, ఏజ్డ్ రోల్ ఒకటి ఉంటుందని, ఆ పాత్ర కోసం మీనాని హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో మీనా పాత్ర కూడా అద్భుతంగా ఉంటుందని టాక్.

బాలకృష్ణ, మీనా మధ్య ఒక సాంగ్ కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగును ఈ నెల రెండో వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇందుకు రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక బాలకృష్ణ, మీనా కాంబినేషన్ లో ఒక ఐదు సినిమాల వరకు వచ్చాయి.

వాటిలో బొబ్బిలి సింహం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అలాగే ముద్దుల మొగుడు కూడా మంచి హిట్ అయ్యింది.

వీరిద్దరి కాంబినేషన్ ని మంచి క్రేజ్ ఉంది.దీంతో మరో సారి బాలకృష్ణతో మీనా అంటే బొబ్బిలి సింహం సినిమాని అందరూ గుర్తు చేసుకుంటారు.

అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి.మరి హీరోయిన్స్ ని పరిచయం చేయడానికి మంచి ముహూర్తం కావాలని బోయపాటి గతంలోనే చెప్పాడు.

ఆ మంచి ముహూర్తం ఎప్పుడు వస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube