ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున హీరోయిన్ సిస్టర్స్ ఎవరో గుర్తు పట్టారా...?

బాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు దాదాపుగా అందరి నటీనటులతో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ “కరీనా కపూర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేద.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.

 Veteran Heroine Karishma Kapoor Wishes To Kareena Kapoor, Karishma Kapoor, Karee-TeluguStop.com

ఆ తర్వాత క్రమక్రమంగా అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సంజయ్ దత్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, వంటి స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.కాగా ఈరోజు ఈ అమ్మడి 41వ పుట్టిన రోజు కావడంతో కొందరు నెటిజన్లు మరియు కరీనా కపూర్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో కరీనాకపూర్ సోదరి మరియు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కరీనా కపూర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.అంతేకాకుండా చిన్నప్పుడు కరీనా కపూర్ తో దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది.

అలాగే ఎంతగానో ప్రేమించే సోదరి మరియు తనని సపోర్ట్ చేసేటువంటి నటి కరీనా కపూర్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ చిన్నప్పుడు కరీనా కపూర్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bollywood, Kareena Kapoor, Karishma Kapoor, Veterankarishma-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి కరీనా కపూర్ పండంటి మగ శిశువుకి జన్మనిచ్చింది.దీంతో గత కొద్ది కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది.కాగా ప్రస్తుతం కరీనా కపూర్ హిందీలో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “ఆది పురుష్” చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఇటీవలే కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా” చిత్రం కూడా షూటింగ్ పనులు పూర్తీ చేసుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube