బరువు తగ్గి మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన హీరోయిన్...

తెలుగు యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన “రణం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యూటీ “కామ్నా జఠ్మలానీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు రణం చిత్రంలో నటించడానికంటే ముందుగా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

 Veteran Heroine Kamna Jethmalani Shining Beautiful Attire-TeluguStop.com

కానీ ప్రాణం చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ కావడంతో ఈ అమ్మడి సినిమా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.దాంతో కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు, తదితర భాషల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలను దక్కించుకుంటూ కొంతకాలం పాటు బాగానే రాణించింది.

కానీ కెరీర్ లో బిజీ బిజీ గా సాగుతున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది.దీంతో ఉన్నఫలంగా సినిమాలకి ప్రాధాన్యత తగ్గించి తన కుటుంబ పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడింది.

 Veteran Heroine Kamna Jethmalani Shining Beautiful Attire-బరువు తగ్గి మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినప్పటికీ అడపాదడపా చిత్రాలలో నటిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.కాగా ప్రస్తుతం నటి కామ్నా జఠ్మలానీ కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

అయితే ఈ మధ్యకాలంలో నటి కామ్నా జఠ్మలానీ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే శ్రమిస్తోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు బరువు తగ్గేందుకు పలు వర్కౌట్లు మరియు ప్రత్యేక ఆహార డైట్ వంటివి పాటిస్తూ బాగానే బరువు తగ్గింది.

అయితే తాజాగా కామ్నా జఠ్మలానీ అందమైన దుస్తులను ధరించి స్కిన్ షో చేస్తూ తీసినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి తొందర్లోనే తానే హీరోయిన్ గా మళ్ళీ వెండి తెరకు పరిచయం కాబోతున్నట్లు సిగ్నల్ ఇచ్చింది.దీంతో కామ్నా జఠ్మలానీ అభిమానులు తమ అభిమాన హీరోయిన్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Kamna Jethmalani, Kamna Jethmalani Beautiful Pics, Kamna Jethmalani Ree Entry News, Veteran Heroine, Veteran Heroine Kamna Jethmalani Shining Beautiful Attire-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా కామ్నా జఠ్మలానీ తెలుగులో చివరగా 2015 సంవత్సరంలో “చంద్రిక” అనే అనువాద చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు కాగా ప్రస్తుతం కన్నడ భాషలో తెరకెక్కుతున్న “గరుడ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

#Veteran Heroine #VeteranHeroine #KamnaJethmalani #KamnaJethmalani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు