రవి తేజ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న వెటరన్ హీరో....

టాలీవుడ్ లో ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి నూతన దర్శకుడు శరత్ మాండవ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 Veteran Hero Venu Thottempudi Re Entry With Ravi Teja Movie-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో రవితేజ కి జోడిగా తెలుగు యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి.

 Veteran Hero Venu Thottempudi Re Entry With Ravi Teja Movie-రవి తేజ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న వెటరన్ హీరో….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో టాలీవుడ్ వెటరన్ హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే ప్రకటించారు.అంతేకాకుండా ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ని కూడా అధికారికంగా విడుదల చేశారు.

అయితే ఒకప్పుడు స్వయంవరం, చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, తదితర చిత్రాలలో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడి ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక పోవడంతో సినిమా ఇండస్ట్రీకి కొంత మేర దూరంగా ఉంటున్నాడు.కాగా ఆ మధ్య టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు.

దీంతో మళ్లీ హీరో వేణు తొట్టెంపూడి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు.మరి రామారావు అయినా హీరో వేణు సినీ కెరీర్ ని మలుపు తిప్పుతాడో లేదో చూడాలి.

Telugu Ramarao On Duty, Ramarao On Duty Shooting Update, Telugu Veteran Hero, Tollywood Maas Maharaja, Venu Thottempudi, Veteran Hero Venu Thottempudi Re Entry With Raviteja Movie-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ఈ ఏడాది ఆరంభంలో “క్రాక్” చిత్రంతో మంచి హిట్ అందుకున్న రవితేజ అదే ఊపు కంటిన్యూ చేస్తూ “ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ” తదితర చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#VeteranHero #TollywoodMaas #Ramarao On Duty #RamaraoOn #TeluguVeteran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు