హీరోగా ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. కానీ విలన్ గా మారి కోట్లు సంపాదిస్తున్నాడు...

తెలుగులో ఒకప్పుడు పలు యాక్షన్ మరియు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ టాలీవుడ్ వెటరన్ హీరో జగపతి బాబు గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు జగపతి బాబు సినీ బ్యాగ్రౌండ్ లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఒకానొక సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని మళ్ళీ నిలబడ్డాడు.

 Veteran Hero Jagapathi Babu Earing Crores Of Rupees In Second Innings, Jagapathi-TeluguStop.com

అయితే గతంలో హీరోగా ప్రేక్షకులని అలరించిన జగపతిబాబు అనుకోకుండా తన చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా అలరించ లేకపోయాడు.దీనికితోడు వరుసగా పది చిత్రాలకు పైగా ఫ్లాపులు వెంట పడడంతో హీరోగా సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.

దాంతో తానే పలు చిత్రాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించి సినిమాలను తెరకెక్కించాడు.అయినప్పటికీ ఆ చిత్రాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టాయి.

దీంతో ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చినప్పటికీ తన సినీ కెరీర్ మాత్రం ప్రశ్నార్ధకంగా మిగిలి పోయింది.

Telugu @iamjaggubhai, Jagapathi Babu, Telugu, Tollywood-Movie

దీంతో సరిగ్గా అదే సమయంలో తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన లెజెండ్ చిత్రంలో విలన్ పాత్రలో నటించే అవకాశం తోపాటు మంచి పారితోషికాన్ని కూడా దక్కించుకున్నాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.దీంతో ఒక్కసారిగా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమా అవకాశాలతో ఊపందుకుంది.

ప్రస్తుతం జగపతి బాబు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అనుభవిస్తున్నాడు.

Telugu @iamjaggubhai, Jagapathi Babu, Telugu, Tollywood-Movie

కాగా జగపతి బాబు ఆ మధ్య మిస్ ఇండియా, ఫక్, పిట్ట కథలు (వెబ్ సీరీస్), తదితర చిత్రాలలో నటించాడు.కాగా ప్రస్తుతం దాదాపుగా ఆరు తెలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో  నటిస్తున్నాడు.ఇందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ చిత్రంలో హీరో అన్నయ్య పాత్రలో నటిస్తున్నాడు.

Telugu @iamjaggubhai, Jagapathi Babu, Telugu, Tollywood-Movie

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో కూడా జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.కాగా ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని చిత్రంలో కూడా జగపతి బాబు స్పోర్ట్స్ కోచ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ వరుస కష్టాలను అనుభవించి మళ్లీ నిలదొక్కుకున్న జగపతిబాబు ప్రస్తుతం ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి అంగీకరిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube