ఓటీటీ కోసం మళ్ళీ మెగా ఫోన్ పట్టిన పాత దర్శకుడు  

Veteran Director Siva Nageswara Rao Web Series - Telugu Rgv, South Cinema, Telugu Cinema, Tollywood, Veteran Director Siva Nageswara Rao Plan To Direct Web Series, Web Series

ప్రస్తుతం సినిమాలో వచ్చిన ట్రెండ్ ని అందుకోలేక చాలా మంది దర్శకులు తమ ఇమేజ్ ని పాడుచేసుకోవడం ఇష్టం లేక దర్శకత్వంకి దూరంగా ఉన్నారు.అయితే కొంత మంది వెటరన్ దర్శకులు మాత్రం మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని తమ సత్తా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.

 Veteran Director Siva Nageswara Rao Web Series

దశాబ్దాల క్రితమే సినిమాలో టెక్నికల్ వండర్స్ గా చూపించిన సింగీతం శ్రీనివాసరావు మళ్ళీ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.అలాగే యాక్షన్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ కూడా బాలకృష్ణతో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఇప్పుడు వీరి బాటలోనే బ్లాక్ కామెడీ చిత్రాలతో తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న శివ నాగేశ్వరరావు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.శివ సినిమాకి కోడైరెక్టర్ గా చేసిన ఇతను తరువాత ఆర్జీవీ ప్రొడక్షన్ ద్వారానే దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

ఓటీటీ కోసం మళ్ళీ మెగా ఫోన్ పట్టిన పాత దర్శకుడు-Movie-Telugu Tollywood Photo Image

మ‌నీ సినిమాలో బ్లాక్ కామెడీని ప్రెజెంట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.తరువాత మనీమనీ, సిసింద్రీ, వ‌న్ బై టూ, ప‌ట్టుకోండి చూద్దాం లాంటి హిట్ చిత్రాలు శివ నాగేశ్వ‌ర‌రావు ఖాతాలో ఉన్నాయి.

చాలా కాలం త‌ర‌వాత ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో పాటు, సినిమాకి దర్శకత్వం వహించడానికి రెడీ అయ్యాడు.రెండు మూడు క‌థ‌లు రెడీ చేసుకున్నారు.అందులో ఓ క‌థ‌ని ప‌ట్టాలెక్కిస్తున్నారు.శివ నాగేశ్వ‌ర‌రావు రాసిన మ‌రో క‌థ‌తో ఓ ద‌ర్శ‌కుడు సినిమా తీస్తున్నార‌ని స‌మాచారం.

అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు న‌టిస్తార‌ని తెలుస్తోంది.ఒటీటీ కోసం హాలీవుడ్ స్టైల్ లో ఓ మాఫియా నేపధ్యంలో బ్లాక్ కామెడీతోనే కంటెంట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

దీనిని త్వరలో పట్టాలు ఎక్కించే ప్రయత్నం జరుగుతుందని టాక్.మరి మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుంటున్న ఈ వెటరన్ దర్శకులు ఏ మేరకు ప్రెజెంట్ జెనరేషన్ ని కనెక్ట్ అయ్యే కథలు అందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test