భర్త చేతిలో చిత్రహింసలకు గురైన స్టార్ హీరోయిన్!

వెటరన్ హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన అలనాటి తార సుజాత ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆమె పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా గోరింటాకు.

 Veteran Actress Sujatha, Tragedy Incidents, Personal Life, Gorintaku Film, Anr,-TeluguStop.com

తన 14వ ఏట సినిమాలలోకి వచ్చిన సుజాత తన మొదటి చిత్రం అవ్వాలోరు తుధల్ కథై మంచి విజయం సాధించడంతో ఎన్నో సినిమాలలో నటించడానికి అవకాశం లభించింది.తమిళ స్టార్ హీరోలైన కమలహాసన్, రజినీకాంత్, జెమినీ గణేషన్ సరసన ఎన్నో సినిమాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు.

గోరింటాకు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సుజాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.కన్నడ, తమిళం,తెలుగు భాషలలో దాదాపుగా మూడు వందల సినిమాలకు పైగా నటించి ఎంతో మంది హృదయాల్లో నిలిచిపోయిన సుజాత తెలుగులో చివరిగా శ్రీరామదాసు సినిమాలో నటించారు.

Telugu Gorintaku, Personal, Shoban Babu, Tragedy, Veteranactress-Movie

సినిమాల్లో నటించేటప్పుడు ఎంతో బాధాకరమైన, ఏడుపు సన్నివేశాలలో నటించిన సుజాత గారికి నిజజీవితంలో కూడా తన భర్త నుంచి ఎన్నో చిత్ర హింసలను, బాధలను అనుభవించింది.తన ఇంటి యజమాని కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజాత తన భర్త చేతిలో ఎన్నో చిత్రహింసలకు గురైంది.

ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ ఎప్పుడు తాగుతూ,సుజాతకు వచ్చిన సినీ అవకాశాలను పోగొడుతూ తనను ఎంతో మానసికంగా వేధించేవాడు.షూటింగ్ నుంచి ఇంటికి రాగానే ఆమెతో కావాలనే గొడవ పెట్టుకునే వాడని అప్పట్లో బాగా ప్రచారం అయింది.

కొన్నిసార్లయితే ఏకంగా షూటింగ్ స్పాట్ కి వచ్చి ఆమెపై చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.ఆమె చివరగా నటించిన శ్రీరామదాసు సినిమా తర్వాత అనారోగ్యానికి గురై కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు.

2011 వ సంవత్సరంలో తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube