మెగా హీరోకి విలన్ గా శివగామి... మామూలుగా ఉండదుగా.....  

veteran actress ramya krishna playing another lady villain role - Telugu Actress Ramya Krishna, Ramya Krishna, Ramya Krishna Movie Chrector News, Ramya Krishna Playing Another Lady Villain Role, Ramya Krishnamovie News, Sai Tej Latest News, Sai Tej Movie News, Sai Tej News, Veteran Actress Ramya Krishna

టాలీవుడ్ లో లేడీ విలన్ మరియు నెగిటివ్ పాత్రలో నటించే సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణ పెట్టింది పేరు.అయితే అప్పట్లోనే రమ్య కృష్ణ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి నరసింహ చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటించి ఔరా అనిపించారు.

 Veteran Actress Ramya Krishna Playing Another Lady Villain Role

అంతేగాక అప్పటి నుంచి ఒక పక్క హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క నెగిటివ్ పాత్రలో కూడా నటించి మెప్పించింది రమ్యకృష్ణ.

అయితే ఇటీవల కాలంలో కూడా ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన టువంటి బాహుబలి చిత్రంలో కూడా ఒకవైపు అమరేంద్ర బాహుబలిపై ప్రేమ చూపిస్తూనే మరోవైపు అతడిపై కుట్ర చేస్తూ మళ్లీ తిరిగి తప్పని తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఏకంగా ప్రాణాలు సైతం వదిలిన శివగామి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.మామూలుగా కొంత మంది హీరోయిన్లకుఒక చిత్రంలో  నెగిటివ్ లేదా ఎమోషనల్ మరియు పాజిటివ్ పాత్రల్లో మాత్రమే నటిస్తుంటారు.కానీ రమ్యకృష్ణ కి పాత్ర ఏదైనా సరే అందులో చక్కగా ఒదిగిపోవడం ఆమెకే చెల్లుతుంది.

మెగా హీరోకి విలన్ గా శివగామి… మామూలుగా ఉండదుగా…..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా రమ్యకృష్ణ మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో విలన్ పాత్ర పోషించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్ట దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు సినీ పెద్దల సమక్షంలో ప్రారంభించారు.అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు దేవకట్టా లేడి విలన్ పాత్రలో నటింపజేసేందుకు సీనియర్ నటి రమ్యకృష్ణ సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేగాక ఈ చిత్రంలో రమ్య కృష్ణ పాత్ర అప్పట్లో ఈమె నటించినటువంటి నరసింహ చిత్రంలో పోషించినటువంటి పాత్రను పోలి ఉంటుందట.అందువల్లే రమ్యకృష్ణ కూడా ఏమి ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఎలా ఉండగా రమ్యకృష్ణ ఒక్క తెలుగులోనే కాకుండా అటు తమిళ కన్నడ చిత్రాల్లో కూడా తన నటన పరంగా అభిమానులను సంపాదించుకుంది.అయితే ప్రస్తుతం తమిళ మరియు కన్నడ లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

#RamyaKrishna #VeteranActress #SaiTej #Sai Tej News #ActressRamya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Veteran Actress Ramya Krishna Playing Another Lady Villain Role Related Telugu News,Photos/Pics,Images..