తన శృంగార వీడియోలను బయట పెడతానంటూ తెలుగు హీరోయిన్ కి బెదిరింపులు... 

తెలుగులో అప్పట్లో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించినటువంటి సొంతం అనే సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి ముద్దుగుమ్మ నమిత తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Veteran Actress Namitha Facing Problems In Social Media-TeluguStop.com

అయితే ఆ తరువాత వచ్చినటువంటి “జెమిని” చిత్రంలో కూడా బాగానే ఆకట్టుకుంది.అయితే ఆ తర్వాత అనుకోకుండా ఈ అమ్మడు బరువు పెరగడంతో పలు సినిమా అవకాశాలు దూరమయ్యాయి.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆకతాయి ఈ అమ్మడిని వేధింపులకు గురి చేస్తున్నాడు.దీంతో నమిత భయపడకుండా ధైర్యంగా వాటిని తిప్పి కొడుతూ తన అధికారిక ఖాతాలో ఈ విషయం గురించి షేర్ చేసింది.

అయితే ఇందులో ఓ ఆకతాయి తన శృంగార వీడియోలు నా దగ్గర ఉన్నాయని, చెప్పినట్లు వినకపోతే వాటిని ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.దీంతో నమిత తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది.

దీంతో భయపడినటువంటి ఆ ఆకతాయి తన అకౌంట్ హ్యాక్ అయిందని అంటూ పలు కారణాలు చెప్పబోయాడు.అయినప్పటికీ నమిత వినకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ ఫైర్ అయ్యింది.

అయితే ఈ చాటింగ్ హిస్టరీ మొత్తం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Telugu Actress Namitha, Namitha Latest, Veteranactress-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.అనుకోకుండా బాగా బరువు పెరిగిన టువంటి ఈ అమ్మడు ఇటీవలే బరువు తగ్గడం కోసం రోజు జిమ్ లో రోజూ బాగానే శ్రమిస్తోంది.  ఇటీవలే దాదాపుగా పది కిలోలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube