ఏంటి? కుక్కకు అవమానం జరిగితే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిందా? అంత పొగరు ఎందుకు ఆమెకు అని మీకు అనిపించచ్చు.కానీ కుక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తుంది కుక్కలా విలువ ఏంటో.
అది పుట్టినప్పటి నుంచి దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో కుక్కలు పెంచే వారికీ మాత్రమే తెలుసు.చిన్న దెబ్బ తగిలిన సహించలేని కుక్కల ప్రియులు అవమానం జరిగితే ఊరికే ఉంటారా? అది కూడా అప్పటికే మనుషులపై ప్రేమ పోయ్ కుక్కలపై పెరిగిన సమయం అది.
అందుకే కుక్కకు అవమానం జరిగిన వెంటనే ఆ నటి అక్కడ ఆగలేకపోయింది.అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయింది.
ఎవరు ఆ స్టార్ హీరోయిన్? అసలు కుక్కకు ఏం అవమానం జరిగింది ? ఆ స్టార్ హీరోయిన్ అంత కోపం ఎందుకు వచ్చిందని డౌట్స్ వస్తున్నాయ్ కదా! అక్కడికే వస్తున్న.ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.
జయలలిత.తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసిన పవర్ ఫుల్ లేడీ.
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, జయలలిత హీరోయిన్ గా ”గూఢచారి 116” సినిమాను తెరకెక్కిస్తున్న సమయం అది.
అప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న జయలలిత తన కుక్కను తీసుకొని షూటింగ్ కి హాజరైంది.అయితే అక్కడ సెట్ లో కొందరు కుక్కను కొట్టబోయారట.దీంతో కోపానికి గురైన జయలలిత షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారట.అయితే అలా వెళ్లిపోవడంపై దర్శకనిర్మాతలు మండిపడి ఆమెతో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని ఆమెను పంపించేశారట.ఇక ఈ గూడచారి 116 సినిమా 1967లో విడుదల కాగా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.
జయలలిత, కృష్ణ సినీ కెరీర్ ని ఒక మలుపు తిప్పిన సినిమా ఇది.ఏది ఏమైనా లేడీ లీడర్ కు మరోపేరు జయలలిత.