తెరపైకి సుమలత బయోపిక్.. కన్నడ నాట టాక్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని బాషలలో బయోపిక్ ట్రెండ్ జోరుగా సాగుతుంది.సౌత్ లో ఈ బయోపిక్ కథల విషయంలో కొంత లిమిట్ గా ఉన్న బాలీవుడ్ మాత్రం దర్శక, నిర్మాతలు ఎక్కువగా బయోపిక్ కథలని చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Veteran Actor Sumalatha Biopic In Sandalwood, Tollywood, Telugu Cinema, South Ci-TeluguStop.com

అయితే సౌత్ దర్శకులు మాత్రం బయోపిక్ కథల విషయంలో ఆచితూచి ముందుకి వెళ్తున్నారు.మహానటి తరువాత తెలుగులో కొన్ని బయోపిక్ లు వచ్చిన వర్క్ అవుట్ కాలేదు.

కథని సరిగ్గా చెప్పలేకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వలన సౌత్ లో బయోపిక్ కథలకి అంత డిమాండ్ లేదు.అయితే కొంత మంది దర్శకులు మాత్రం ఈ బయోపిక్ లు చేయాలని అనుకుంటున్నారు.

ఆలా ఇప్పుడు కన్నడననాట వెటరన్ స్టార్ హీరోయిన్, ఎంపీ సుమలత బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.తెలుగమ్మాయి అయిన సుమలత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సౌత్ లో అన్ని భాషలలో సినిమాలు చేసింది.

అలాగే కన్నడంలో ఎక్కువ సినిమాలు చేసింది.అదే సమాయంలో కన్నడనాట రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.తరువాత సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఎప్పుడో ఒకసారి తెరపై కనిపిస్తుంది.భర్త అంబరీష్ చనిపోయిన తరువాత ఆయన దారిలోనే ఆమె కూడా రాజకీయాలలోకి వచ్చి స్వాతంత్ర్య అభ్యర్థిగా మాండ్యా నియోజకవర్గం నుంచి ఎంపీగా భర్త స్థానంలో పోటీ చేసి గెలిచింది.

ఆమె జీవితంలో నాటకీయత ఎక్కువగా ఉండటంతో దర్శక, నిర్మాత గురుదేశ్ పాండే ఆమె బయోపిక్‌ తెరకెక్కించేందుకు కన్నడలో సన్నాహాలు జరుగుతున్నాయట.ఇటీవల సుమలతని కలిసి బయోపిక్‌ గురించి చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఆమె నట జీవితంతో పాటు రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఈ ప్రాజెక్టులో చూపించనున్నారట.2019లో జరిగిన మాండ్య ఎన్నికల్లో సుమలత ఎంపీగా గెలిచిన దాన్ని హైలైట్‌గా చూపించాలనుకుంటున్నారట.10 నుంచి 15 ఎపిసోడ్స్‌తో గరుదేశ్‌ పాండే ఓ వెబ్‌ సిరీస్‌గా సుమలత బయోపిక్‌ని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube