హెల్త్‌ టిప్స్‌ : మీ శరీరంలో విషం దాగి ఉంది.. ఆ విషాన్ని ఎలా బయటకు పంపేయాలో తెలుసా?

మనం ఈమద్య కాలంలో తినే ఆహారం బాగా విషతుల్యం అవుతోంది.కల్తీ ఆహారం తీసుకోవడంతో పాటు ఎక్కువ స్థాయిలో జంక్‌ ఫుడ్స్‌ మరియు అధికంగా ఆల్కహాల్‌ వంటివి తీసుకోవడం వల్ల అత్యంత దారుణమైన ప్రభావం మన శరీరంపై పడుతోంది.

 Very Useful Health Tips For Every One-TeluguStop.com

వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకునే ఆహార పదార్థాల కారణంగా శరీరంలో మలినాలు తయారు అవుతున్నాయి.ఆ మలినాలు కాస్త కొన్ని రోజుల్లో విషపదార్థాలుగా మారుతున్నాయి.

ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ విషం అనేది మనిషిని చంపేస్తుందని నిపుణులు చెబుతున్నారు.శరీరంలోని విషయం అనేక రూపాల్లో ఉంటుంది.

ఆ విషంను తొలగించుకోవడం వల్ల ఎక్కువ కాలం బతికే అవకాశ ఉంటుంది.

శరీరంలోని విషంతో అలాగే ఉంటే కొన్ని సంవత్సరాలకు విషం ప్రాణాంతకం అయ్యి అదే ప్రాణాలను తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉదాహరణకు ఎక్కువ ఆహారం తీసుకుంటే లావు ఎక్కువ అవుతారు.అంటే కొవ్వు రూపంలో విషయం ఆ వ్యక్తిలో ఉంది.

ఆ కొవ్వు మెల్ల మెల్లగా ఆ వ్యక్తికి గుండె పోటు వచ్చేంత స్థితికి చేరుతుంది.అదే కొవ్వు ఆరంభ దశలో ఉన్నప్పుడు తొలగించుకుంటే మనిషి బతికేవాడు.

ఇలా ఎన్నో రకాల విషాలు శరీరంలో ఉంటాయి.అన్ని రకాల విషాలను తొలగించుకునేందుకు ఇప్పుడు కొన్ని పద్దతులు, కొన్ని పదార్థాలను మీకు సూచించడం జరుగుతుంది.

వాటిని ఫాలో అయ్యి మీ శరీరంలోని విషాన్ని తొలగించుకోండి.

హెల్త్‌ టిప్స్‌ : మీ శరీరంలో వ�

శరీరంలో ఉన్న మలినాలు ఎక్కువగా నీటి ద్వారా తొలగి పోతాయి.అందుకే ప్రతి రోజు కూడా ఎక్కువ పరిణామంలో నీళ్లు తాగాలి.నీరు తాగడం వల్ల చెమట మరియు మూత్రం రూపంలో ఎక్కువ శాతం మలినాలు అదే విషం బయటకు వెళ్లి పోతుంది.

శరీరంలో విషయం పేరుకు పోవడంకు ముఖ్య కారణం చెక్కర మరియు ఇతర స్వీట్లు.అందుకే చెక్కర తినకుండా దూరంగా ఉండటం మంచిది.

శరీరంలో ఉన్న ఫ్యాట్‌ విషంను కరిగించి బయటకు పంపించేందుకు రోజులో కనీసం కిలో మీటరు అయినా నడవాలి.ఇక ఎక్కువ మిలినాలు ఉన్న వారు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచినా నష్టం లేదు.

స్వచ్చమైన గ్రీన్‌ టీ వల్ల కడుపులో ఉన్న పలు సూక్ష్మ జీవులు మరియు మలినాలు శుభ్రం అవుతాయి.గ్రీన్‌ టీ అనేది లోపల నుండి స్నానం వంటిది.

అందుకే గ్రీన్‌ టీ తాగడం వల్ల మంచి ఆరోగ్యం.

తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎలాంటి పురుగు మందులు జల్లని సేంద్రీయ ఆహార పదార్థాలను తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

నిమ్మరసం వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు తాగితే కడుపులోని మలినాలు చాలా వరకు తొలగి పోతాయి.

ఇక శరీరంకు సుఖం చాలా అవసరం.అందుకే ప్రతి రోజు తప్పనిసరిగా కనీసం 6 నుండి 9 గంటలు అయినా నిద్ర పోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube