15 నిమిషాల్లో జియో యాక్టివేట్ అయిపోతుంది

ఇటివలే ముఖేష్ అంబాని “జియో” భవిష్యత్తుపైన ఇచ్చిన ప్రసంగం చూసే ఉంటారు మీరు.అందులో అంబాని చెప్పిన ఓ ప్రధాన అంశం వంద మిలియన్ల వినియోగదారులని పొందడం.

 Very Soon, Jio Sim Will Get Activated Within 15 Minutes – Ambani-TeluguStop.com

రోజుకి ఒక మిలియన్ కస్టమర్లను రాబడుతూ, ఈ ఏడాది పూర్తయ్యేలోపు వంద మిలియన్ల కస్టమర్స్‌ ని తన ఖాతాలో వేసుకోవాలని ఆలోచించింది జియో.కాని అలా జరగట్లేదు.

జియో పూర్తిగా మార్కెట్లోకి దిగిన తరువాత కేవలం 5 మిలియన్ల కొత్త వినియోగదారులు మాత్రమే యాడ్ అయ్యారట.రోజుకి ఒక మిలియన్ కస్టమర్లను రాబట్టుకోవాలని ప్లాన్ వేస్తే, రోజుకి సగటున అయిదు లక్షలమంది కొత్త వినియోగదారులు నమోదవుతున్నారట.

మరి రెస్పాన్స్ అనుకున్న విధంగా ఎందుకు రావట్లేదు?

ఒకటి, బ్లాక్ లో థర్డ్ పార్టీలు వేల రూపాయలకి జియో సిమ్ అమ్ముతున్నారు.రెండు, సిమ్ అంత త్వరగా యాక్టివేట్ అవట్లేదు.

కొని 15 రోజులు దాటినా, సిమ్ యాక్టివేట్ కాని దురదృష్టవంతులు కూడా ఉన్నారు.ఈ సమస్యపై మాట్లాడుతూ, ముఖేష్ అంబాని క్షమాపణలు తెలిపారు.

ఈ సమస్య కోసం విసృత స్థాయిలో సమాధానలు వెతుకుతున్నామని, త్వరలోనే ఒక కొత్త టెక్నాలజీ ద్వారా వస్తామని, అప్పుడు జియో సిమ్ యాక్టివేషన్ కోసం ఎవరు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని, ఐడి ఫ్రూఫ్ సబ్మిట్ చేసి, అప్లికేషన్ నింపిన 15 నిమిషాలకే సిమ్ యాక్టివేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube