అంతరించిపోయిన అరుదైన తెల్ల జిరాఫీలు.... కంటతడి పెడుతున్న నెటిజన్లు

ప్రపంచంలో వివిధ కారణాల వల్ల అరుదైన జీవజాతులు అంతరించిపోతున్న విషయం తెలిసిందే.కెన్యా దేశంలో రెండు అరుదైన తెల్ల జిరాఫీలు ఉండగా అవి తాజాగా వేటగాళ్ల చేతిలో హతమయ్యాయి.

 Very Rare White Giraffes Kenya Country-TeluguStop.com

రెండు జిరాఫీలు హతమవ్వటంతో అరుదైన తెల్ల జిరాఫీ జాతి అంతరించిపోయింది.తూర్పు కెన్యాలోని గారిస్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కొన్ని రోజుల క్రితం ఆడ జిరాఫీ ఒక కూనకు జన్మనివ్వగా రెండు జిరాఫీలను వేటగాళ్లు హతమార్చారు.

ఇన్ని రోజుల పాటు అధికారుల పర్యవేక్షణలో ఉన్న జిరాఫీలను కొందరు దుండగులు డబ్బులకు ఆశపడి హతమార్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన ప్రభుత్వం, ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.అరుదైన జీవ జాతి అంతరించిపోయిందని తెలిసి జంతు ప్రేమికులు కంటపెడి పెడుతూ తమ ఆవేదనను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

Telugu Kenya, Rarewhite, White Giraffes-

సాధారణంగా ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు చాలా ప్రత్యేకమైనది.తెలుపు రంగులో ఉన్న జంతువులను మిగతా జంతువులతో పోలిస్తే ప్రత్యేకంగా చూస్తామనే విషయం తెలిసిందే.చాలా దేశాలలో తెలుపు రంగులో ఉన్న జంతులు ఎల్లప్పుడు అధికారుల పర్యవేక్షణలో సంరక్షించబడతాయి.కెన్యా ప్రభుత్వం ఆ రెండు జిరాఫీలను సంరక్షించినప్పటికీ వేటగాళ్ల నుండి వాటిని కాపాడలేకపోయాయి.

భూమి మీద ఉన్న ఇతర అరుదైన జాతులనైనా సంరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది.జంతు జాతులు అంతరించిపోతే మానవజాతి మనుగడకు ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube