వైరల్‌ : పాతికేళ్లు చెత్తలో పడి ఉన్న రూ.500 కోట్ల ఆర్ట్‌, దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?  

Very Rare Painting Found In Italian Gallery Wall Confirmed As Long Lost Klimt-central Bank Of Italy,italian Gallery Wall,klimt

వజ్రం మట్టిలో వందేళ్లు ఉన్నా కూడా దాన్ని బయటకు తీస్తే మళ్లీ అది వజ్రమే అవుతుంది తప్ప మట్టి అవ్వదు.అంటే విలువైన వస్తువులు ఎక్కువ శాతం చెత్తలో పడ్డా మట్టిలో పెట్టినా కూడా దాని గొప్పతనం తగ్గదు.

Very Rare Painting Found In Italian Gallery Wall Confirmed As Long Lost Klimt-Central Bank Of Italy Italian Klimt

అలాగే పాతికేళ్ల క్రితం మిస్‌ అయిన ఒక ఖరీదైన పెయింటింగ్‌ ఈమద్య చెత్త మద్య లభించింది.ఇన్ని సంవత్సరాలు దాన్ని పట్టించుకోకున్నా ఎండకు ఎండి, వానకు తడిచినా కూడా ఆ ఖరీదైన పెయింటింగ్‌ ఎలాంటి డ్యామేజీ కాలేదు.

అసలు ఇన్ని సంవత్సరాలు అంత ఖరీదైన పెయింటింగ్‌ చెత్తలో ఎందుకు ఉందని మీ అనుమానమా.అసలు విషయం ఏంటీ అంటే…
ఇటలీకి చెందిన రిచ్చీ అనే ఆర్ట్‌ గ్యాలరీలో 1917లో గుస్తవ్‌ అనే పెయింటర్‌ వేసిన ఒక అమ్మాయి ఆర్ట్‌ను ఉంచడం జరిగింది.

మొదట్లో దాని ఖరీదు తక్కువే అయినా కాల క్రమేనా ఆ ఆర్ట్‌ విలువ అమాంతం పెరిగింది.ఇటలీలో ఉన్న అత్యంత ఖరీదైన ఆర్ట్‌ వర్క్‌లో అది ఒకటిగా పేరు దక్కించుకుంది.

అంతటి క్రేజ్‌ ఉన్న ఆర్ట్‌ వర్క్‌ను పాతికేళ్ల క్రితం ఎవరో దొంగలు దొంగిలించారు అంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.ఆ ఆర్ట్‌ వర్క్‌ను కనిపెట్టేందుకు పోలీసులు చాలా కాలం పాటు అనేక చోట్ల ఎంక్వౌరీలు చేశారు.

ఎంతగా ఎంక్వౌరీ చేసినా కూడా ఆ ఆర్ట్‌ మాత్రం లభించలేదు.చివరకు కేసు అటకెక్కించారు.అందరు కూడా ఆ ఆర్ట్‌ను మర్చి పోతున్న సమయంలో అనూహ్యంగా అదే ఆర్ట్‌ గ్యాలరీలో ఒక చెత్త ఊడ్చే వ్యక్తికి ఆ ఆర్ట్‌ కనిపించింది.

ఒక గోడ సందులో చెత్తను క్లీన్‌ చేస్తున్న సమయంలో ఒక ఫ్రేమ్‌ అతడికి కనిపించింది.వెంటనే దాన్ని బయటకు తీయగా అది ఒక పెయింటింగ్‌.దాని విలువ అప్పుడు అతడికి తెలియదు.దాన్ని తీసుకు వెళ్లి ఆర్ట్‌ గ్యాలరీ ఉన్నతాధికారులకు చూపించడం జరిగింది.వారు దాన్ని గుర్తించారు.దాని విలువ ఏకంగా 500 కోట్లు ఉంటుందని చెప్పగానే ఆ స్వీపర్‌ ఆశ్చర్య పోయాడు.అసలు ఆ గోడ సందులో ఈ ఆర్ట్‌ ఎలా ఉందని అధికారులు ఆశ్చర్య పోతున్నారు.

మొత్తానికి ఆ ఆర్ట్‌ లభించడంతో అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.ప్రస్తుతం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇటలీలో ఆ ఆర్ట్‌ను భద్రపర్చినట్లుగా అధికారులు చెప్పారు.

పోలీసులు గ్యాలరీకి చెందిన సిబ్బంది ఎవరో ఆ ఆర్ట్‌ను దొంగలించి బయటకు తీసుకు వెళ్లడం వీలు పడక పోవడంతో అక్కడ వదిలేసి ఉంటారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

.

తాజా వార్తలు

Very Rare Painting Found In Italian Gallery Wall Confirmed As Long Lost Klimt-central Bank Of Italy,italian Gallery Wall,klimt Related....