నత్తల సునామి పెను ప్రమాదంలో ఉన్న కేరళ.. ఏం చేయాలో పాలుపోక జట్టు పీక్కుంటున్న ప్రభుత్వం  

Very Huge Snails In Kerala-

ఏదైనా అతిగా సంభవిస్తే సునామి అనవచ్చు.కేరళలో ప్రస్తుతం నత్తలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.సంవత్సరంకు నాలుగు రెట్లు చొప్పున నత్తల సంఖ్య పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో అసలేం చేయాలో పాలుపోక ప్రభుత్వం కూడా ఆగం ఆగం అవుతుంది...

Very Huge Snails In Kerala--Very Huge Snails In Kerala-

నత్తల వల్ల సమస్యలు ఏంటి అని మీకు అనుమానం రావచ్చు.ఇంట్లో ఒక పిల్లి ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.దాన్ని చక్కగా చూసుకోవచ్చు.

పది పిల్లులు ఉంటే ఇష్టం అయినా చిరాకు కలుగుతుంది.ఇంట్లో వంద పిల్లులు ఉంటే ఆ ఇంట్లో ఉండగలమా.?

Very Huge Snails In Kerala--Very Huge Snails In Kerala-

ప్రస్తుతం ఇదే పరిస్థితి కేరళ ప్రజలు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా తీర ప్రాంతాలకు చెందిన వారు అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.నత్తలు ఒకటి రెండు వంద వేలు ఉంటే పర్వాలేదు.కాని కేరళలో కోట్లాది నత్తలు ఉంటున్నాయి.

మన వద్ద నత్తలను చూడాలంటే పెద్ద సాహస యాత్రే చేయాలి.కాని అక్కడ కాళు పెడితే కాలికింద ఒక నత్త పడుతుంది.చేయి పెడితే చేతికి తలుగుతుంది...

రెండు మూడు రోజులు ఇల్లు వదిలేసి వెళ్తే బెడ్‌ రూం కిచెన్‌ ఇలా అంతటా కూడా నత్తలే నత్తలు.ఈ మధ్య కాలంలో నత్తల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

మూడు నాలుగు సంవత్సరాల క్రితం నత్తలు చాలా తక్కువగానే ఉండేవి.

కాని వాటి అభివృధ్ది మరీ దారుణంగా ఉంది.ఏడాదిలోనే భారీగా పెరిగి పోతున్న నేపథ్యంలో రాబోయే అయిదు సంవత్సరాల్లో పరిస్థితి ఏంటా అంటూ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.పంట పొలాలను నాశనం చేయడంతో పాటు, ప్రతి చోట కూడా నత్తలు ప్రత్యక్షం అవుతున్నాయి.

ఈ పరిస్థితి నుండి ఎలా భయటపడాలో అర్ధం కాని పరిస్థితి.నత్తల నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు 1 శాతం అయితే అవి పెరుగుతున్న శాతం 99 లా ఉంది.

భవిష్యత్తును ఊహించుకుని కేరళ వాసులు గుండెలు పట్టుకుంటున్నారు.అందమైన పకృతికి అలవాలంగా నిలిచి, దైవ భూమిగా పేరు దక్కించుకున్న కేరళకు ఇంతటి పరిస్థితి రావడం విచారకరం.

శాస్త్రవేత్తలు త్వరగా ఈ సునామికి పరిష్కారం కనుక్కొంటే బాగుండు కదా.!