తవ్వుకొన్న వాడికి తవ్వుకొన్నంతా బంగారం.. ఎక్కడో తెలుసా..?!

ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న విషయం అందరికీ తెలిసిందే.ప్రస్తుతం బంగారం ధర చూస్తే మధ్యతరగతి కుటుంబాల వారు బంగారం కొనడం అంటే చాలా కష్టంగా మారింది.

 Very Huge Gold Mountain Found In Democratic Republic Of Congo-TeluguStop.com

పసిడి ని గ్రాములలో కొనటం జరిగిన కానీ లక్షల్లో ఖర్చవుతుంది.ఇలాంటి సమయంలో ప్రజలకి ఒక్కసారిగా బంగారం కొండ కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.

ఇంకేముంది తట్ట, పార తీసుకొని తవ్వుకొని వెళ్లిపోవడమే తరువాయి.

 Very Huge Gold Mountain Found In Democratic Republic Of Congo-తవ్వుకొన్న వాడికి తవ్వుకొన్నంతా బంగారం.. ఎక్కడో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కూడా ఇదే జరిగింది.

అదెక్కడ అంటే డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో లో ఈ పరిస్థితి ఏర్పడింది.ఆ దేశంలో ఉన్న ఓ కొండలో తవ్వేకొద్దీ బంగారం బయట పడుతుంది.

ఈ విషయం ఆ ప్రాంతంలోనే ఉన్న స్థానిక ప్రజలకు తెలుసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు పెద్ద పెద్ద సంచులను తీసుకోవచ్చి ఇంటికి బంగారం రంగు ఉన్న రాళ్ళను తవ్వుకొని తీసుకు వెళుతున్నారు.వారు సేకరించిన మట్టిలో మధ్యలో ఏకంగా 60 నుంచి 90 శాతం వరకు బంగారం ఉన్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చేతికి దొరికిన వస్తువుతో మట్టిని తవ్వి బంగారం రంగులో కనపడిన ప్రతి రాయిని అక్కడి వారు తమ వెంట తీసుకు వెళ్తున్నారు.

Telugu Congo Government, Democratic Republic Of Congo, Gold, Golden Mountain, Mountain, People Mining Gold, Village, Viral Latest, Viral News-Latest News - Telugu

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మార్గాల్లో తెగ వైరల్ గా మారింది.ఇలా మట్టిని త్రవ్వడానికి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు భూమిని తవ్వకంలో అనేక మంది తొక్కిసలాటలో ఇబ్బంది పడుతున్నారు.అలా వారు ఆ మట్టిని తవ్వితే తర్వాత చాలామంది దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి శుభ్రపరుచుకుని బంగారాన్ని వేరు చేస్తుండగా మరికొందరైతే ఆ ప్రాంతంలోనే దానిని శుభ్రం చేసి అందులో ఉన్న బంగారాన్ని మాత్రమే ఇంటికి తీసుకువెళ్తున్నారు.

దీంతో ఆ దేశ ప్రభుత్వం మైనింగ్ శాఖ అప్రమత్తం కావడంతో ఆ కొండపై ఉన్న బంగారాన్ని తవ్వడానికి అనుమతులు ఇవ్వలేదు.ఉత్తర్వులు ఇచ్చేవరకు అక్కడ ఎవరు మైనింగ్ చేయకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది.

కాంగో దేశంలో బాగా ప్రసిద్ధి చెందిన వజ్రాలు, అనేక రకాల ఖనిజాలు, కలప లాంటి సహజ నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి.వీటితో పాటు అక్కడ పెద్ద ఎత్తున బంగారం నిక్షేపాలు కూడా ఉన్నాయి.

#Golden Mountain #Gold #Village #Mountain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు