ఎండాకాలం కదా అని కూల్‌ వాటర్‌ ఎక్కువగా తాగుతున్నారా... మీ ఆరోగ్యం నాశనం  

Very Cool Water Not Good For Health-telugu Health Tips

గతంలో ఎప్పుడు లేని విధంగా ఎండలు మండి పోతున్నాయి. ఈ మాట ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం. అంటే సంవత్సరం సంవత్సరంకు ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంది..

ఎండాకాలం కదా అని కూల్‌ వాటర్‌ ఎక్కువగా తాగుతున్నారా... మీ ఆరోగ్యం నాశనం-Very Cool Water Not Good For Health

ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ సూర్యడు హాఫ్‌ సెంచరీ కొట్టి మూడు నాలుగు వందల మందిని చంపినట్లుగా రిపోర్ట్‌లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చల్లని నీరు తాగుతూనే ఉంటారు, ఉన్నారు. మరీ ఎక్కువ చల్లటి నీరు తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రిజ్‌లో మరీ కూల్‌గా ఉన్న వాటర్‌ను తాగితేనే కొందరికి తృప్తి. కాస్త కూల్‌ తగ్గినా కూడా ఆ బాటిల్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో కొన్ని నిమిషాలు ఉంచి ఆ తర్వాత తాగుతున్నారు.

గడ్డ కట్టిన నీటిని కొందరు తాగడం మనం చూస్తూనే ఉంటాం. మనలో కూడా చాలా మంది పల్లు జువ్వమనేంత కూల్‌ ఉన్న వాటర్‌ను మాత్రమే తాగేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే అలా మరీ అతిగా కూల్‌ ఉన్న వాటర్‌ తాగడం వల్ల అజీర్తి సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు..

పూర్తి వివరాల్లోకి వెళ్తే. మరీ కూల్‌ వాటర్‌ను తాగడం వల్ల చర్మంకు సంబంధించిన శ్వేదరంద్రాలు మూసుకు పోతాయి.

అలా మూసుకు పోవడం వల్ల చర్మ సంబంధిత జబ్బులు రావడంతో పాటు, ఇంకా పలు అనర్ధాలు వస్తాయి.

కూల్‌ వాటర్‌ తాగడంతో అవి నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణాశయం కుచుంచుకు పోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే డీహైడ్రేషన్‌ జరిగే అవకాశం కూడా ఉంది.

తిన్న వెంటనే బాగా కూల్‌ వాటర్‌ తాగడం వల్ల తిన్న తిండి అరగడం జరగదు. అసలు ఆహారం ఎక్కువగా జీర్ణవ్యవస్థలోకి చేరకుండానే బయటకు వెళ్లి పోతుందట.

కూల్‌ వాటర్‌ వల్ల పళ్ల సమస్యలు కూడా వస్తాయి.

సెన్సిటివిటీ వంటి సమస్యలు రావడంతో పళ్లు పుచ్చి పోయే అవకాశం ఉందట.

మొత్తానికి కూల్‌ వాటర్‌ తాగితే ప్రయోజనం కంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.

మరి ఎండాకాలం కూల్‌ వాటర్‌ కాకుండా వేడి వాటర్‌ తాగాలా అనే కదా మీ అనుమానం. కూల్‌ వాటర్‌ తాగాలి కాని మరీ కూల్‌ కాకుండా ఉండాలి..

అంటే కుండలో వాటప్‌ పెడితే ఎంత మేరకు కూల్‌ అవుతాయో ఆ కూల్‌ను వాడితే పెద్దగా సమస్యలు ఉండవు. ఇక వర్షకాలం మరియు చలికాలం నీటిని వేడి చేసుకుని తాగితే జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది.