కింగ్ ఫిషర్ బీరు రూ.44లకే.. అతితక్కువలో ఇతర బీర్, విస్కీ ధరలు.. ఎక్కడంటే..

చాలా మంది వారాంతాల్లో కొంచెం మద్యం తాగుతుంటారు.ఇక కుర్రాళ్లు అయితే బీర్ తాగనిదే వీకెండ్ పూర్తి కాదని భావిస్తుంటారు.

 Very Cheap Alcohol Rates At Delhi Naval Officers Mess Details, Alcohol News, Liq-TeluguStop.com

వారం అంతా బాగా కష్టపడి, చివర్లో ఇలా చిల్ అవుతుంటారు.దీంతో ఆ వారంలో ఆఫీసులో, ఇంటాబయటా ఉన్న ఒత్తిడి, ఆందోళనను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఏదేమైనా ప్రస్తుత రోజుల్లో అన్ని వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి.ముఖ్యం బీర్, విస్కీ, ఇతర ఆల్కహాల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

దీంతో ఏదో వేడుకలలో మాత్రమే ఎక్కువ మంది తాగుతున్నారు.అయితే రక్షణ రంగంలో ఉండే వారికి చాలా తక్కువ ధరకే మద్యం లభిస్తోంది.వారికి సంబంధించిన ఓ రెస్టారెంట్‌లో కింగ్ ఫిషర్ బీర్ కేవలం రూ.44లకే లభిస్తోంది.ఇతర బీర్లు, లిక్కర్ ధర చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Telugu Alcohol, Cheapalcohol, Cheap Liquor, Delhinaval, Kingfisher Beer, Liquor-

ఇటీవల కాలంలో ఏపీలో ఒక మద్యం బాటిల్ కొంటే ఆ ధరకు ఇతర రాష్ట్రంలో మూడు మద్యం బాటిళ్లు కొనొచ్చనే మీమ్ బాగా వైరల్ అవుతోంది.మద్యం ధరలు అంతగా పెరిగిపోయాయి.ఈ పరిస్థితుల్లో అనంత్ అనే ట్విటర్ యూజర్ పెట్టిన ఓ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.కింగ్ ఫిషర్ బీర్ రూ.44, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ రూ.48, ఇక విస్కీ ధరలు చాలా చీప్‌గా లభిస్తున్నాయి.తన ట్వీట్‌కు “నా బెంగుళూరు మెదడు ఈ ధరలను అర్థం చేసుకోలేకపోయింది” అని క్యాప్షన్ రాశాడు.అయితే ఇవన్నీ ఏ రెస్టారెంట్‌లో లభిస్తున్నాయోనని అంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.

Telugu Alcohol, Cheapalcohol, Cheap Liquor, Delhinaval, Kingfisher Beer, Liquor-

ఈ ధరలన్నీ ఢిల్లీలోని నేవీ ఆఫీసర్స్ మెస్‌లో తక్కువకే లభిస్తున్నాయి.ఆల్కహాల్ ధరలు నెటిజన్లను షాక్‌కు గురి చేశాయి.చాలా ఆల్కహాల్ బాటిల్స్ ధర రూ.100 కంటే తక్కువగా ఉంది.ఈ ట్వీట్ చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.కొందరైతే తమ తమ ప్రాంతాల్లో ఎంత ఎక్కువ ధరలు ఉన్నాయో చెప్పి బోరుమంటున్నారు.కొందరు నెటిజన్లు కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలుతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.కాకపోతే ఇవి నేవీలో పని చేస్తున్న, రిటైర్ అయిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలుసుకుని నిరుత్సాహ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube