ఒకప్పటి ఫోటోను షేర్ చేసిన వర్మ.. ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు?

ప్రముఖ తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.ఈయన పరిచయం గురించి తెలినోలే లేరు.

 Verma Who Once Shared A Photo-TeluguStop.com

ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మందిని హీరోలుగా పరిచయం చేశాడు.ఇక తన సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

నిజానికి వర్మ తనకు నచ్చినట్లు ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన పోస్టులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు.

 Verma Who Once Shared A Photo-ఒకప్పటి ఫోటోను షేర్ చేసిన వర్మ.. ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Rakta Charitra, Ram Gopal Varma, Suriya, Tollywood-Movie

నిజానికి వర్మ పెట్టే పోస్టులు బాగా సెన్సేషనల్ గా మారుతుంటాయి.చాలా వరకు ఆయన పెట్టే పోస్టులు అర్థం కాక తల పట్టుకునేలా ఉంటాయి.ఇక సమాజంలో జరిగే విషయాల పట్ల బాగా కౌంటర్లు వేస్తుంటాడు.ఏ విషయమైనా ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడుతుంటాడు వర్మ.ఇక ఈయన ఇంటర్వ్యూలు చూస్తే చాలు తన బోల్డ్ మాటలతో అందరిని షాక్ అయ్యేలా చేస్తాడు.

ఇక సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక ఫోటో పెడతూ హాట్ టాపిక్ గా మారుస్తాడు.

ఇక తాజాగా ఓ ఫోటో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.అందులో తన దర్శకత్వంలో తెరకెక్కిన రక్తచరిత్ర సినిమాకు సంబంధించిన ఫోటో ఉండగా అందులో హీరో సూర్య నటించాడు.

ఇక ఈ నేపథ్యంలో అందులో సూర్య, వర్మ కలిసి ముచ్చట్లు పెడుతున్నట్టు ఉండగా ఈ ఫోటోను చూసిన నెటి జనులు ఈ సమయంలో ఏ సందర్భం లేకుండా ఈ ఫోటో ఎందుకు పంపించాడు అని తెగ జుట్టు పీక్కుంటున్నారు.

ఇక మరికొందరు ఏదైనా కారణం ఉందా మళ్లీ సూర్యతో సినిమా చేయనున్నారా అని కామెంట్స్ చేయగా.మరి కొందరు రాత్రి తాగింది దిగలేదా అంటూ తమకు ఇష్టం వచ్చినట్లు కౌంటర్లు వేస్తున్నారు.ఇక ఈ కామెంట్స్ ను పట్టించుకోని వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

#Ram Gopal Varma #Suriya #Rakta Charitra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు