తిట్లు ఆపండి అంటూ మరో గుడ్ న్యూస్ చెప్పిన అర్జీవి!

ప్రముఖ తెలుగు డైరెక్టర్ ఆర్జీవి పరిచయం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే ఈయన దర్శకుడిగా కంటే సోషల్ మీడియాలో స్పందించే విధానం పట్ల బాగా పరిచయం పెంచుకున్నాడు.

 Verma Responds To Bold Comments, Ariyana Glory, Ram Gopal Varma, Tollywood, Bold-TeluguStop.com

ఏదో ఒక పోస్టుతో అందరిని షాక్ అయ్యేలా చేసాడు.పైగా అర్థం కానీ పోస్టులతో తల పట్టుకునేలా చేస్తాడు.

అంతేకాకుండా నెటిజన్ల నుండి బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటాడు.

ఇదిలా ఉంటే తనను ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీగా మారిన అరియానా గురించి అందరికీ తెలిసిందే.

ఆర్జీవి తో ఇంటర్వ్యూ చేసి బిగ్ బాస్ లో ఆఫర్ అందుకొని మొత్తానికి సెలబ్రేటిగా మారింది.ఇదిలా ఉంటే ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ను బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆ ఇంటర్వ్యూ ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో చూస్తూనే ఉన్నాం.అందులో కొన్ని బోల్డ్ మాటలతో కొన్ని దూషణలు ఎదురయ్యాయి.ఇక వర్మను చాలా మంది టార్గెట్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ తో నింపేశారు.

ఇక ఈ కామెంట్స్ కు స్పందించిన వర్మ ఇటీవల ఓ వీడియో షేర్ చేసి తనదైన శైలిలో స్పందించాడు.

తను అరియనా చేసిన ఇంటర్వ్యూ లో తన ఛానెల్ కు, భలా ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కు 40 లక్షల వ్యూస్ వచ్చాయని అందుకు తను, అరియనా చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపాడు.ఎవరైతే ఇంటర్వ్యూ చూసి సంతోషపడని వారందరికీ తన లవ్ అని తెలిపాడు.

పైగా ఇంటర్వ్యూ చూసి సంతోషపడని వారికి తమ లాంటి మెచ్యూరిటీ లేదని అది రావడానికి సమయం పడుతుందని తనదైన శైలిలో స్పందించాడు.ఇదిలా ఉంటే మరో గుడ్ న్యూస్ షేర్ చేశాడు వర్మ.

ఇంటర్వ్యూ చూసి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఏదో అయిపోయిందని అనుకునే వాళ్లకు ఉచిత సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నాడట.ఆ ఇంటర్వ్యూ చూసి చిల్ ఇవ్వడం నేర్చుకోమంటూ, జీవితాన్ని సీరియస్ గా కాకుండా హ్యాపీ గా ఉండండి అంటూ, ఎంజాయ్ చేయడం నేర్చుకోండి అంటూ గట్టిగా స్పందించాడు.ఇదిలా ఉంటే అరియనా మిక్స్ ఆర్జీవి అనే అదే వీడియోలో చిన్నచిన్న గిమ్మిక్కులు చేసి విడుదల చేస్తున్నామని తెలిపాడు.ఆ వీడియోని చూసిన వాళ్లు ఆనందించండని, నచ్చని వాళ్ళు కామెంట్ చేయండి.

తిట్టండి.లేదా దూషించే ప్రోగ్రాం పెట్టండి అంటూ దానివల్ల తమకు వ్యూస్ పెరుగుతాయని అందుకు ముందుగా థాంక్స్ చెబుతున్నాను అంటూ మరో వీడియో షేర్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube