నన్ను మోసం చేసిన వాళ్లను వదిలే ప్రసక్తేలేదంటున్న వర్మ.. అసలేం జరిగింది?

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బాగా కోపం వచ్చినట్లు ఉంది.అందుకే ఏకంగా పోలీస్ మెట్లెక్కి తనని మోసం చేసిన వారిపై కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు.

 Verma Im Not Going To Leaving Those Who Cheated On Me What Actually Happened , R-TeluguStop.com

ఇలా రామ్ గోపాల్ వర్మ పోలీస్ మెట్లు ఎక్కడంతో అసలేం జరిగింది అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ సినిమా విడుదల కాకుండా నిర్మాత నట్టికుమార్ అడ్డుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య పెద్ద వార్ నడిచింది.

ఈ క్రమంలోనే న్యాయపోరాటం కోసం వర్మ నడుం బిగించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.నట్టి కుమార్ కు తాను 50 లక్షలు ఇస్తాను అన్నట్టుగా హామీ పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే నట్టికుమార్ చూపించిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తిగా ఫేక్ అని వర్మ కొట్టిపారేశారు.ఈ క్రమంలోనే ఆ డాక్యుమెంట్స్ పై ఉన్న సంతకం నాది కాదు అలాగే ఆ డ్రస్ నాది కాదని కేవలం కోర్టును తప్పుదోవ పట్టించడం కోసమే ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ సృష్టించారని వర్మ పేర్కొన్నారు.

Telugu Rgv, Certificate, Nattikumar, Ram Gopal Varma, Telugu, Tollywood, Verma-M

ఈ విధంగా దొంగ డాక్యుమెంట్స్ తో నన్ను మోసం చేసిన వాళ్లని వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలోనే వాళ్ళు మీ పై పెట్టిన కేసును సంగతి ఏంటి అని ప్రశ్నించగా అది అవే ఇవి ఇదే అంటూ వర్మ సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే నట్టికుమార్ స్పందిస్తూ వర్మ గతంలో చాలా మందిని మోసం చేశారని అందుకే ఆయన పాతబస్తీ ముంబయి వంటి ప్రాంతాలలో కూడా తన ఆఫీసులను ఎత్తి వేశారని ఆయన చేతిలో మోసపోయిన వారు ఎందరో తనని కలుస్తున్నారు అంటూ నట్టికుమార్ తెలిపారు.అందుకే వర్మ తీసిన సినిమాలని విడుదల చేయకూడదని నిర్మాతలను కోరినట్లు నట్టి కుమార్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube